ఒంటిమిట్ట రాములొరి సేవలో గవర్నర్ దంపతులు
కడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే వారికి టీటీడీ తిరుపతి జేఈవో బీ లక్ష్మీకాంతం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.

చల్లంగా చూడు స్వామీ ..
తర్వాత శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఒంటిమిట్ట రాములొరి చిత్రపటం అందజేశారు. సీతారాముల కల్యాణాన్ని వెన్నెల్లో జరపడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు గవర్నర్ నరసింహన్. రాష్ట్ర ప్రజలపై శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారాయన.












Click it and Unblock the Notifications