వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలకవర్గం ఫెయిల్.. అందుకే నిరసనలు, హోం మంత్రి కామెంట్స్‌పై పవన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఒక్కసారిగా కోనసీమ అట్టుడికింది. జిల్లాకు భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో అమలాపురంలో హై టెన్షన్ నెలకొంది. అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని కోరారు.

 ఇదీ సరికాదు..

ఇదీ సరికాదు..


భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పాలక వర్గం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పాలనపర లోపాలను కప్పి పుచ్చుకోవడానికి.. లేని సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి కారణం ఎవరనేది రాష్ట్రంలో గల ప్రజలందరికీ తెలుసునని అన్నారు. బాధ్యత గల పదవీలో ఉన్న హోం మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండించారు.

 బాధాకరం

బాధాకరం


అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకించడం బాధాకరం అని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేయడంతో మార్చామని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారని వివరించారు. వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తప్పమని హెచ్చరించారు.

పేరు మార్చడం కుదరదు..?

పేరు మార్చడం కుదరదు..?


మహానేత పేరు పెడితే పునరాలోచించాల్సిన అవసరం ఏముందని అడిగారు. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి. ముందు అందరూ సంయమనం పాటించాలి.. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని మంత్రులు, నేతలు అంటున్నారు. విపక్షాలు మాత్రం వైసీపీ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు.

English summary
government fail in maintain law and order janasena chief pawan kalyan counter to home minister vanitha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X