గురి చూసి కొట్టిన చంద్రబాబు, వైసీపీ లీడర్స్ లో వణుకు, ఆ భూములు రికార్డులు

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 22ఏ కింద మార్పు చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్ లు మూడు నెలలపాటు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పలు జిల్లాలోని వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని తెలిసింది. ఇప్పటికే విక్రయాలు జరిగిన భూములపై విచారణ కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, గూడూరు, సుళూరుపేట పట్టణాల సమీపంలో ఉన్న వేల ఎకరాల భూముల విషయంలో గోల్ మాల్ జరిగిందని, ఆ భూముల వ్యవహారంలో చాలా గోల్ మాల్ జరిగిందని ఆ భూముల పత్రాలను పరిశీలించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్లు జరిగిన ఆ భూము అసలు హక్కుదారులు ఎవరు, కొనుగోలుదారులు ఎవరు అనే వివరాలు పరిశీలించి తరువాత నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

Government formed a special committee with sub-collector in case of land gol mall scam

క్షేత్ర సాయి లో పర్యటించి ఫిజికల్ రికార్డ్స్, కంప్యూటర్ రికార్డులు, రిజిస్ట్రేషన్ జరిగిన తీరు పరిశీలించాలని చంద్రబాబు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాంతాల్లో భూముల అమ్మకాలు, మార్ట్ గేజ్, గిఫ్ట్ డీడ్ అయిన రిజిస్ట్రేషన్ భూముల పత్రాలను సంబందిత అధికారులు పరిశీలించాలని సిద్దం అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ రిజిస్టర్, తాసిల్దార్, మండల సర్వేయర్లు స్వయంగా వెళ్లి 22 ఏ భూముల వ్యవహారం గురించి అరా తీయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Government formed a special committee with sub-collector in case of land gol mall scam

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసైన్డ్, ఫ్రీ ఓల్డ్ భూములు వేల ఎకరాలు ఇప్పటికే క్రయ విక్రయాలు జరిగాయని, ఈ విక్రయాలు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, అసైన్డ్ భూములు, 22ఏ భూములు, వెసులుబాటు కల్పించిన భూములు రికార్డులు మొత్తం పరిశీలించడానికి సబ్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ సిద్ధమైందని సమాచారం. అదేవిధంగా డిజిటల్ సంతకాల పైన అనేక అనుమానాలు ఉన్నాయని వెలుగు చూసింది.

Government formed a special committee with sub-collector in case of land gol mall scam

చట్ట విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ల విషయంపై బాధితులు డివిజన్ సాయి అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇనాం భూములు పెద్ద ఎత్తున ఫ్రీ హోల్డ్ కింద చేర్చారని, చుక్కల భూములు పరిస్థితి ఇలాగే ఉందని వెలుగు చూసింది. సుమారు పదివేల ఎకరాల డాక్యుమెంట్ లపే పరిశీలించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారని సమాచారం. ముఖ్యంగా వందలు, వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఉండే తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు ఎవరెవరు చేతుల్లోకి వెళ్లాయి అంటూ కూటమి ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరిస్తుందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+