ఏపీలో పింఛన్‌దారులకు కూటమి సర్కారు గుడ్‌న్యూస్

పింఛన్‌దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ల పంపిణీని మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా.. మూడో నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం గురువాం ఉత్తర్వులు జారీ చేసింది

వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే.. అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పింఛను మంజూరు చేయనున్నారు. కాగా, ప్రస్తుతం పెన్షన్ దారులు రెండు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా కారణాల వల్ల రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో ముందు రెండు నెలల పెన్షన్ చెల్లించేవారు కాదు. కానీ, పెన్షన్ దారుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటును కల్పించింది.

Government good news for pensioners in AP

ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలల పెన్షన్ ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం కలిగింది. ఇక, కుటుంబ యజమాని మరణిస్తే అతడి పెన్షన్ రద్దు అవుతోంది. మృతుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. తాజాగా, ఈ నిబంధనను కూడా ప్రభుత్వం మార్చింది.

పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే.. మరుసటి నెల నుంచి మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో పింఛన్ దారులు హర్షం వ్యక్త చేస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నకల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నెల 3వ తేదీలోపే పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+