వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్..సరఫరా అందుకు మాత్రమే

|
Google Oneindia TeluguNews

ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణకు పోరాటం చేస్తూనే మరోవైపు ఏపీలో పరిపాలనపై దృష్టి పెట్టారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి . అందులో భాగంగా మరో రెండు నెలల్లో వర్షాకాలం కాబటి ఇప్పటినుండే ఇసుక తవ్వకాలపై దృష్టి సారించారు . ఒకపక్క కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యటానికి లాక్ డౌన్ విధించి అన్ని పనులను నిలిపివేసిన సర్కార్ తాజాగా ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . దీంతో నేటి నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.

నేటి నుండి ఇసుక తవ్వకాలు .. సరఫరా నాడు-నేడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాలకు మాత్రమే

నేటి నుండి ఇసుక తవ్వకాలు .. సరఫరా నాడు-నేడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాలకు మాత్రమే

లాక్ డౌన్ కారణంగా గత నెల 22 నుంచి ఇసుక తవ్వకాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఇక వర్షాకాలంలో ఇసుక కష్టాల నుండి గట్టెక్కించటం కోసం గత సంవత్సరంలా కాకుండా ముందస్తుగా చర్యలు చేపడుతుంది ఏపీ ప్రభుత్వం . అందులో భాగంగా తవ్వకాలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు సమీక్షలు నిర్వహించి తవ్వకాలకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం తవ్వకాల ద్వారా వెలికి తీస్తున్న ఇసుకలో కేవలం నాడు-నేడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం పనులకు మాత్రమే సరఫరా చేయనున్నారు.

వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఇసుక కొరత రాకుండా ఇప్పటినుండే తవ్వకాలు

వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఇసుక కొరత రాకుండా ఇప్పటినుండే తవ్వకాలు

కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఇసుక డోర్‌ డెలివరీ పథకానికి ప్రస్తుతానికి అనుమతి లేదని అధికారులు చెప్తున్నారు . ముందస్తుగా స్టాకు యార్డులకు ఇసుక తరలించి నిల్వ చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగ భవిష్యత్ లో ఇసుక కష్టాలు లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ర్యాంపులను తెరిచి ఇసుకను స్టాక్‌ యార్డులకు తరలిస్తున్నారు. ఇక ఇప్పటికే గత వారం రోజుల నుండి కొన్ని ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి.

ఇసుక తవ్వకాలలోనూ, స్టాక్ పాయింట్ల వద్ద పని చేసే వారికి నిబంధనలు

ఇసుక తవ్వకాలలోనూ, స్టాక్ పాయింట్ల వద్ద పని చేసే వారికి నిబంధనలు

గండేపల్లి, జగ్గంపేట, తాడేపల్లిగూడెం స్టాకు యార్డుకి ఇసుక చేరవేస్తున్నారు. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయంతో రానున్న రోజుల్లో భీమవరం, ఉండి, కాపవరం వంటి స్టాకు యార్డులకు ఇసుక తరలించనున్నారు. ఇక నేటి నుంచి ఐ.పంగిడిలో నూతనంగా స్టాకు యార్డు ప్రారంభం కానుంది. ఇక ఇసుక తవ్వకాల వద్ద అలాగే ఇసుక స్టాక్ యార్డుల వద్ద కూడా సామాజిక దూరం పాటించాలని, అందరూ మాస్కులు ధరించాలని, గుంపులుగా ఉండరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు .

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇబ్బంది లేని పలు కీలక నిర్ణయాలు

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇబ్బంది లేని పలు కీలక నిర్ణయాలు

ఇక మరోపక్క లాక్ డౌన్ తో నిర్మాణాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇప్పుడు కరోనా దెబ్బకు మరోమారు కుదేలవుతున్నారు . కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే నిదానంగా లాక్ డౌన్ ఎత్తివేసి మానవ జీవన మనుగడ మునుపటిలా సాగేలా కసరత్తులు చేస్తుంది ఏపీ సర్కార్. ఈ క్రమంలోనే నిత్యావసరాలతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇబ్బంది లేని పలు అంశాల ఇషయంలో లాక్ డౌన్ నిబంధనలను సడలించే ఆలోచన చేస్తుంది ఏపీ ప్రభుత్వం .

English summary
Due to the lockdown, sand mining has been halted since last month. Unlike last year, the AP government is taking precautionary measures to protect the sand from the rainy season. As excavations are about to begin again, the authorities are conducting reviews and considering the arrangements for the excavation. However, only on the sand currently being supplied for nadu - nedu, NREGS scheme .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X