త్వరలోనే ఏపీ ప్రజలకు "వైఎస్ జగన్ క్యారవాన్"
దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకానికి మంచి ఆదరణ లభిస్తోంది. వినోద, విహార యాత్రలకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లడం.. బస గురించి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్నిరకాల సౌకర్యాలతో కూడిన వసతిని అందించి ప్రజలకు మంచి అనుభూతిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.

ఏపీటీడీసీ కసరత్తులు
విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి కొన్నేళ్లుగా మనదేశంలోను క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, హిమాచలప్రదేశ్, గోవా తదితరచోట్ల మొబైల్ హౌస్ పర్యాటకం ఉంది. కేరళ రాష్ట్రం ఇటీవలే ఈ తరహా పర్యాటకాన్ని తమ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్ తర్వాత దెబ్బతిన్న పర్యాటక రంగానికి క్యారవాన్ సంస్కృతి కొత్త ఊపును అందిస్తోందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇప్పుడు దీనిపై దృష్టిసారించాయి. తాజాగా దీన్ని తీసుకురావడానికి ఏపీటీడీసీ కసరత్తులు చేస్తోంది.

ఏసీ, టాయిలెట్లు, షవర్
ఈ క్యారవాన్ లో ఏసీ, టాయిలెట్లు, షవర్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఉంటాయి. ఒక ఫ్రిడ్జ్, కిచెన్, బార్బిక్యూ సౌకర్యం ఉంటుంది. మనకు నచ్చిన ఆహారం వండుకోవడానికి అవసరమైన అన్ని పాత్రలుంటాయి. ఇందులో ఉండే సోఫాలను మంచాలుగా మార్చుకోవచ్చు. బయట గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కూడా ఉంది. క్యారవాన్లు ఖరీదైనవి కావడంతో అందరూ కొనుగోలు చేయలేరు. విహార యాత్రకు వెళ్లడానికి వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు ప్రజలందరికీ అవకాశం కల్పిస్తున్నాయి. ఇందులో బోర్డ్ గేమ్‌లు, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటాయి.

వాహనం సైజును బట్టి..
ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి తొమ్మిది మంది వరకు ఇందులో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. డ్రైవర్‌తో పాటు అందుబాటులో ఉంటాయి. లేదంటే సెల్ఫ్ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి, సెల్ఫె డ్రైవింగా? లేదంటే డ్రైవర్ తోనా? తదితరాలనుబట్టి చార్జీలు వసూలు చేస్తారు. అతి త్వరలోనే ఏపీ ప్రజలకు క్యారవాన్ అనుభూతులను పంచడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.












Click it and Unblock the Notifications