తిరుపతిలో ఆ భూములు గోవింద గోవింద, ఎన్ని వందల రూ. కోట్లు, ఎన్ని ఎకరాలో తెలుసా ?
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి పాదల చెంత ఉన్న తిరుపతిలో అక్రమాలు, భూ దందాలు భారీ ఎత్తున జరిగాయని వెలుగు చూసింది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం రావడంతో అందరూ భూమన కరుణాకర్ రెడ్డి మంత్రి అవుతారని అనుకున్నారు. కాని కొన్ని కారణాలు, కుల సమీకరణాల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. జగన్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ సమయంలో సైలెంట్ అయిపోయారు.

తిరుపతిలో ఇంటి స్థలాలు కోట్ల రూపాయాలు పలుకుతున్నాయి. తిరుపతిలోని ప్రభుత్వ భూములుల, 22 ఏ భూములను వైసీపీ నాయకులు కబ్బాలు చేశారని తిరుపతికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగు చూసింది.
తిరుపతి నగరంలోని కొర్లగుంట, తాతయ్యగుంట, తంబవానిగుంట, సింగాలగుంట, రెడ్డిగుంట, ఎరుకల కాలనీ, నవోదయ కాలనీ, అక్కరం పల్లె, చంద్రశేఖర్ కాలనీ, ఆటో నగర్, మారుతినగర్, అంబేద్కర్ కాలనీ, ఎల్ బి నగర్, క్రిష్ణానగర్, గాయిత్రీ నగర్, సుందరయ్య నగర, సత్యనారాయణపురం తదితర ప్రాంతా్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములను క్రమబద్దీకరణ చెయ్యడానికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అవకాశం కల్పించారని ఆరోపణలు ఉన్నాయి.

2023 మార్చి 22వ తేదీన అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భూపరిపాలనా ముఖ్య కమిషనర్ కు లేఖ రాశారు. అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లేఖను పరిశీలించిన భూ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కేవలం వారం రోజుల్లోనే స్పందించారని, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అప్పటి తిరుపతి కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారని కూటమి ప్రభుత్వం పరిశీలనలో వెలుగు చూసింది.
2023 మే 9వ తేదీన తిరుపతి తహసిల్దారుకు లేఖ రాసి సర్వే నెంబర్ల వారిగా రెవెన్యూ పత్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే నెల 21వ తేదీన పై అధికారుల ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల జాబితాలో నుంచి తిరుపతి అర్బన్ మండలం పరిధిలోని 836 ఎకరాల ప్రభుత్వ భూములను తొలగిస్తూ అప్పటి తిరుపతి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
పలు ప్రాంతాల్లోని భూములను వినియోగంలో లేని కుంటలుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్పటి అధికారులు అనుమతి ఇచ్చారని, అప్పటి రెవెన్యూ అధికారులు సైతం జనవనరుల శాఖ అధికారుతో పాటు ఏ శాఖ అధికారును సంప్రధించకుండా వైసీపీ నాయకులకు అనుకూంగా రిజిస్ట్రేషన్లు చేశారని, అప్పటి తిరుపతి ఉప మేయర్ అభినయ్ రెడ్డి స్వయంగా పలు రిజిస్ట్రేషన్లలో సాక్షి సంతకం చేశారని కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగు చూసింది.

అయితే పేదలకు ఇవ్వాల్సిన ప్రభుత్వ భూములను తాము నిరుపేదలు అని చెప్పకున్న వైసీపీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ భూములను కబ్జా చేశారని, వీటిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కు ఫిర్యాదులు చేశారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కొందరు వైసీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications