అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య సీరియస్ గా తీసుకున్నా... ప్రతి పైసా ఇప్పిస్తా: సిఎం చంద్రబాబు

Recommended Video

    జగన్ కు బాధ్యత లేదు: సిఎం చంద్రబాబు

    అమరావతి:అగ్రి గోల్డ్ కుంభకోణం అనేది టీడీపీ ప్రభుత్వం రాక ముందు జరిగిన అతిపెద్ద స్కామ్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాలు వద్ద అగ్రిగోల్డ్‌ బాధితుల్లో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కులను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు.

    అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి అందరం సమన్వయంతో కృషి చేద్దామని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను తాను చాలా సీరియస్ గా తీసుకుంటున్నానని...వారి ప్రతి పైసా వసూలు చేసి ఇప్పిస్తానని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. "నేను అసోసియేషన్‌ను ఒకటే కోరుతున్నా...మీరు బాధితుల తరఫున మాట్లాడుతున్నారు. బాధితులతో కమిటీ వేసుకోండి"...అని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుకు సిఎం సూచించారు.

    న్యాయపోరాటానికి...సహకరిస్తా

    న్యాయపోరాటానికి...సహకరిస్తా

    అగ్రిగోల్డ్ సంస్థపై కోర్టులో న్యాయపోరాటానికి ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేయడానికి ప్రతి జిల్లాలో ఒక కమిటీ చొప్పున 13 జిల్లాల్లో 13 కమిటీలు వేయాలని హైకోర్టును కోరామని ఆయన తెలిపారు.

    ప్రతిపక్ష నేత...బాధ్యత లేదు

    ప్రతిపక్ష నేత...బాధ్యత లేదు

    అగ్రిగోల్డ్‌కు 30 వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని ప్రతిపక్ష నేత అంటుంటే మీరెందుకు ఖండించడంలేదని బాధితుల సంఘం నేతలను సిఎం చంద్రబాబు నిలదీశారు. ప్రతిపక్ష నేత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. మీ బాధలను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారు' అన్నారు.

    మీకు...అండగా ఉంటా

    మీకు...అండగా ఉంటా

    బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుంది...మీకు న్యాయం జరిగే వర కూ అండగా ఉంటానంటూ సీఎం భరోసా ఇచ్చారు. ‘సమస్య పరిష్కారం కోసం పోరాడదాం. కోర్టులు పరిష్కారం చూపేలా కృషి చేద్దాం. అందరూ ధైర్యంగా ఉండాలి. మరోసారి కూర్చొని పరిష్కరించుకుందామని చంద్రబాబు చెప్పారు.

    రాజకీయాలతో...సంబంధం లేదు

    రాజకీయాలతో...సంబంధం లేదు

    అగ్రిగోల్డ్ బాధితుల్లో 43 మంది మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల వంతున రూ.2.15 కోట్ల చెక్కులను సిఎం చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమకు రాజకీయాలతో సంబంధం లేదని, సమస్య పరిష్కారం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సీఐడీ అడిషనల్‌ డైరెక్టర్‌ అమిత్‌ గార్గ్‌, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+