ఏపీలో రేషన్ కార్డుదారులకు సర్కారు బిగ్ షాక్..
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు మరోసారి కూడా కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా నిలిపివేసిన కందిపప్పు పంపిణీ జూలై నెలలోనూ కొనసాగనుందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది కార్డుదారులకు ఇది మరో భారం అవుతుందని వాపోతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.120 నుంచి రూ.160 వరకూ విక్రయిస్తున్నారు. ఇదే కందిపప్పును రేషన్ షాపుల్లో రూ.67కే అందించాల్సిన ప్రభుత్వం మార్కెట్ ధరల పెరుగుదలతో ఇబ్బందుల్లో పడినట్టు భావిస్తున్నారు. అందుకే కందిపప్పు పంపిణీ నిలిపివేసినట్టు అనుకుంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే జూలై నెల నుంచి బియ్యం, చక్కెర, రాగులతోపాటు కందిపప్పు కూడా అందజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ కందిపప్పు స్టాక్‌లు రేషన్ షాపులకు చేరలేదని సమాచారం. ఇతర వస్తువులు అందుబాటులోకి వచ్చినప్పటికీ కందిపప్పు మాత్రం ఇంకా రాలేదని చర్చ జరగుతోంది. దీంతో రేషన్ కార్డుదారులు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అప్పుడే మొదలైపోయిందని అధికారులలు చెబుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలు సహా రేషన్ షాపులు రెండు పూటలా అందుబాటులో ఉంచాలని రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications