సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులు వీరు - సీఎం జగన్..!!
తమ రంగాల్లో జీవితాలను అర్పించి..మన హేరిటేజ్‌ను తమ భుజాల మీద మోసిన రంతా మన జాతి సంపద అని ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. ఈ రోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రధానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డులు చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయం సంపూర్ణంగా కూడా వర్ధిల్లిందని చెప్పుకొచ్చారు. వైఎస్సార్..నేడు ఏపీ ప్రభుత్వం పేదల కోసం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు.
వైఎస్సార్ అవార్డులు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైయస్ జగన్,వైయస్ విజయమ్మ, మంత్రులు పాల్గొన్నారు. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్ధాలుగా సుసంపన్నం చేసిన మహానీయులను ఈ సందర్భంగా గౌరవిస్తూ..వైయస్‌ఆర్ అవార్డులతో సత్కరించే సంప్రదాయం గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంతా ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులుగా సీఎం అభివర్ణించారు. వీరంతా మన జాతి సంపద అని ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు.

వేగంగా ముందుకు : పేదల ఆరోగ్యం కోసం 108 ప్రవేశ పెట్టిన వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశంలోనే తొలి సారిగా రైతు భరోసా కేంద్రా ఏర్పాటు అభినందనీయమన్నారు. నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోందని చెప్పుకొచ్చారు. అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలక ఇచ్చారని గుర్తు చేసారు. ప్రస్తుత ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందన్నారు. నామినేటెడ్ పదవులు..పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని వివరించారు. స్వచ్చ సర్వేక్షన్ లో ఏపీ 7వ స్థానంలో నిలిచిందని చెప్పారు. వికేంద్రీకరణతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ అవుతుందని చెప్పారు. అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోందని గవర్నర్ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ చిరస్థాయిగా నిలుస్తారు : డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయం, విద్యా, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా..అంతకుముందున్న చరిత్రగతిని మార్చుతూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా కూడా చూశామని సీఎం జగన్ చెప్పారు. ఈ సంవత్సరం 27 మందికి వైయస్‌ఆర్ అవార్డులతో సత్కరించామన్నారు. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్ అవార్డులు, 23 మందికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రధానం చేసారు. తెలుగు తనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మనపేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తురూపమైన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి పేరిట ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులను ప్రధానం చేసినట్లు సీఎం జగన్ వివరించారు.












Click it and Unblock the Notifications