విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ కు పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలు -హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు. కొవిడ్‌ అనంతర(పోస్ట్‌ కొవిడ్‌) లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయనను తీసుకెళ్లినట్లు తెలిసింది. తొలుత ఈనెల 15న గవర్నర్‌ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుండగా... వైద్యులు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈనెల 17న ఆయన్ను అత్యవసరంగా హైదరాబాద్ గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల చికిత్స అనంతరం కోలుకోవడంతో ఈనెల 23న డిశ్చార్జ్ అయ్యి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. చికిత్స సమయంలో ఆయన వేగంగా కోలుకున్నారు. గవర్నర్ సతీమణి సైతం కోవిడ్ కు గురయ్యారు. రాజ్ భవన్ లో పని చేసే సిబ్బందిలోనూ కరోనా లక్షణాలు గుర్తించారు. ఆయన హైదరాబాద్ లోని ఏఐజీలో చికిత్స పొందే సమయంలో ముఖ్యమంత్రి జగన్ అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీసారు. తెలంగాణ గవర్నర్ ఆస్పత్రికి వెళ్లి ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసారు.

Governor Biswa Bhusan Harichandan effected with post covid symptoms, shifted to AIG Hospital

Recommended Video

Andhra Pradesh లో Load Relief కి వేళాయరా.. కోతల వేళలు | Electricity Crisis || Oneindia Telugu

హరిచందన్ వయసు 83 ఏళ్లు. ఆయనకు ఊపరితిత్తుల్లో వచ్చిన చిన్న సమస్య కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇక, ఆదివారం రాత్రి మరోసారి అస్వస్థతకు గురికాగా..రాజ్‌భవన్‌ వర్గాలు తిరిగి డాక్టర్లను సంప్రదించగా, అదనపు చికిత్స అవసరమని వారు సూచించారు. కాగా గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

English summary
AP Governor Governor Biswa Bhusan Harichandan suffering with post covid seymptoms. He is undergoing treatment at the Asian Institute of Gastroenterology (AIG) Hospitals at Gachibowli in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X