కేసీఆర్-చంద్రబాబు అసంతృప్తి, ఆరా తీసిన గవర్నర్!: నేడు ఢిల్లీకి నివేదిక

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. పలువురు ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. అలాగే, తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఆయన రెండు రోజుల క్రితం తన టూర్ షెడ్యూల్ మార్చుకొని మరీ అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విభజన హామీలు, కేంద్రంతో వివాదం, టీడీపీ నేతల వ్యాఖ్యలు తదితర అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది. చంద్రబాబుతో చర్చించిన అంశాలను ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారని తెలుస్తోంది.

ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీ

ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీ

కాగా, ఢిల్లీ నుంచి పిలుపు రావడంతోనే గవర్నర్ నరసింహన్ వెళ్తున్నారని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ బయలుదేరుతారు. రెండు మూడు రోజులు అక్కడే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులను కలుస్తారు. తెలంగాణ, ఏపీలలోని పరిస్థితులపై నివేదిక ఇస్తారని సమాచారం.

చంద్రబాబును కలిసి ఆరా!

చంద్రబాబును కలిసి ఆరా!

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడం లేదంటూ బీజేపీపై టీడీపీ అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం గవర్నర్ నరసింహన్.. సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మోడీపై వ్యక్తిగత విమర్శలు సరికాదని, అలాగే కేంద్రంతో వైరం సరికాదని చంద్రబాబుకు గవర్నర్ సూచించారని తెలుస్తోంది. అదే సమయంలో అసంతృప్తి, ఆవేదన, ప్రజల మనోభావాలు ఇతర అంశాలను గవర్నర్ అడిగి

ఇది అకస్మిక పర్యటన

ఇది అకస్మిక పర్యటన

ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది. కాగా, రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన నివేదికను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. దీనిని ప్రధానికి అందజేసే అవకాశముంది. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి మరొకటి ఇస్తారు. అనంతరం 26న తిరిగివస్తారు. గవర్నర్‌ గత నెలలో ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు జరిగేది అకస్మిక పర్యటన.

ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్

ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్

ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి, ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం ఏపీ, తెలంగాణలలో పర్యటించి, ఇక్కడి పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. కేంద్రంలో, ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

తెలంగాణలో ఇలా

తెలంగాణలో ఇలా

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొత్త జాతీయ కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. మమతా బెనర్జీ, దేవేగౌడ, కుమారస్వామి, హేమంత్ సోరెన్, అజిత్ జోగి తదితరులను కలిశారు. దీంతో పాటు హైకోర్టు విభజన, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సహా కేంద్రం ఇచ్చిన పలు హామీలను అమలు చేయకపోవడం, ఒక్క ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వకపోవడం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ పార్లమెంటులో తెరాస ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర విధానాలను కేసీఆర్‌ విమర్శిస్తున్నారు. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలోను గవర్నర్ పర్యటన ఆసక్తిని రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+