శ్రీధర్ బాబు ఇష్యూపై గవర్నర్, సైకిల్ పైనా వెళ్లగలను
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించి తనకు తెలియదని గవర్నర్ నరసిహంన్ బుధవారం చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మంత్రుల శాఖ మార్పు ఫైల్ తన వద్దకు రాలేదని, వస్తే రాజ్యాంగం ప్రకారం విధులను నిర్వర్తిస్తానని చెప్పారు. ఆర్టీఏ కమిషనర్ల నియామకంలో రాజ్యాంగం ప్రకారమే తాను వ్యవహరించానని చెప్పారు.
తాను వ్యక్తిగతంగా ఎలాంటి భద్రతను కోరుకోనని గవర్నర్ చెప్పారు. అరవయ్యేళ్లుగా తనకు హనుమాన్ గుడికి వెళ్లడం అలవాటు అని, తాను గుడికి వెళ్లడం ఇతర భక్తులకు ఇబ్బంది కలగకూడదని అన్నారు. గవర్నర్‌గా ఉన్నా తాను సాధారణ వ్యక్తిగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. భద్రత లేకుండా తాను సామాన్య వ్యక్తిగా సినిమాకు వెళ్లగలనని, షాపింగ్ చేయగలనని, సైకిల్ పైన వెళ్లగలనని, ప్రజల మధ్య బస్సులో తిరగగలనని చెప్పారు.

డిప్యూటీతో జానా, శ్రీధర్ బాబు భేటీ
మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో శ్రీధర్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డిలు భేటీ అయ్యారు. కిరణ్ వ్యూహాలపై వారు సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం.
అధిష్టానానికి ఫిర్యాదు యోచనలో మంత్రులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి పైన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ప్రాంత మంత్రులు ఉన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రి పైన ఫిర్యాదు చేశారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు వివరాలు ఆయనకు తెలియజేశారు.












Click it and Unblock the Notifications