నథింగ్ సెన్సేషనల్: రాజ్‌నాథ్‌తో భేటీపై గవర్నర్, 'బాబును అరెస్టు చేయండి'

న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నిరాకరించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వంటి కీలక అంశాలపై హోం మంత్రితో చర్చిస్తారని భావించిన నేపథ్యంలో భేటీ తర్వాత ఏమీ లేదంటూ చెప్పేశారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో నరసింహన్ దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భేటీ వివరాల గురించి మీడియా ప్రతినిధులు శుక్రవారం ఉదయం ప్రశ్నించగా, ఏమీ లేదబ్బా.. రొటీన్ మీటింగ్.. నథింగ్ సెన్సేషనల్ అంటూ వెళ్లిపోయారు. అంతకు ముందు ఆయన కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

Governor rejects to comment on meeting with Rajnath Singh

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసి ఆయనను ఆరెస్టు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వ్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన శుక్రవారం ఆరోపించారు.

నోటుకు ఓటు కేసు విచారణ సాగుతుండగానే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నిక్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఎపిలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బలం లేకపోయినా టిడిపి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పోటీ చేస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+