గవర్నర్ గారూ!..వినతిపత్రం ఇద్దామంటే...అమరావతికి రారెందుకు?:ఎపిసిసి
Recommended Video

విజయవాడ:తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తీరును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దుయ్యబట్టింది. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై గవర్నర్ కు వినతిపత్రం ఇద్దామంటే ఆయన రావడం లేదని ఎపిసిసి విమర్శిస్తోంది.
విజయవాడ లో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు గాను గవర్నర్ కు గతంలో ఒకమారు, తాజాగా మరోసారి లేఖలు రాయడం జరిగిందని, అయినా ఏమాత్రం స్పందన లేదని విమర్శించారు. బహుశా గవర్నర్ బిజెపి వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారేమోనని ఎద్దేవా చేశారు.
సోమవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి ఊమెన్ చాందీ, కొప్పుల రాజు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు. అనంతరం ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ మీడియాతో మాట్లాడారు.

రఘువీరా
తొలుత ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా మట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై దర్యాప్తు చేయాలని...మోదీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు గవర్నరు ద్వారా వినతి పత్రం సమర్పిస్తామని, దీనిని విజయవాడలో గానీ, అమరావతిలో గానీ అందుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు గతంలో లేఖ రాశామని.. తాజాగా మరోసారి రాశామని చెప్పారు. కానీ గవర్నర్ నుంచి కనీస స్పందన లేదన్నారు.

వినతిపత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా
బహుశా ఆయన హైదరాబాద్‌లో బీజేపీ ఎన్నికల వ్యవహారాల్లో తనమునకలై ఉన్నందువల్ల విజయవాడకు రాలేకపోతున్నారేమోనని రఘువీరా ఎద్దేవాచేశారు.
గతంలో చీటికీ మాటికీ చిన్నా చితకా కార్యక్రమాలకు అమరావతి వచ్చే నరసింహన్...కాంగ్రెస్ వినతి పత్రం ఇవ్వాలనుకుంటే ఎందుకు రాలేదని, రావడం లేదని నిలదీశారు. అయినప్పటికీ వినతిపత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా ఆయనకు పంపుతున్నామని తెలిపారు.

రాఫెల్ వ్యవహారంపై
2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని...రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ.41 వేల కోట్ల అవినీతికి పాల్పడిన ప్రధాని మోదీని జైలుకు పంపుతామని రఘువీరా హెచ్చరించారు. ప్రధాని మోడీని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎందుకు విమర్శించడం లేదు. రాఫెల్ వ్యవహారంపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు?.. అని రఘువీరా నిలదీశారు.

ఊమెన్ చాందీ
ఈ క్రమంలో తిరుపతి మాజీ ఎంపి చితామోహన్ ఎపిసిసి అధ్యక్షుడిగా రఘువీరాను తప్పించాలని కాంగ్రెస్ ఎపి వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ డిమాండ్ చేశారు. "పీసీసీ అధ్యక్షునిగా బీసీ వర్గాలకు చెందిన రఘువీరారెడ్డి నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన హయాంలో పార్టీ ఎంత బలం పడిందో చూశాం. ఇక చాలు...ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించండి"...అని చాందీని చింతా మోహన్ కోరారు. దీనిని ఆయన తిరస్కరించారు. అనంతరం రాఫెల్ వ్యవహారంపై విజయవాడ లెనిన్ సెంటర్‌లో రఘువీరా ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications