మీరే మాట్లాడుకోవచ్చుగా: 'పది'పై ఏపీ వర్సెస్ తెలంగాణపై గవర్నర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మీరే కూర్చొని మాట్లాడుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారని తెలుస్తోంది. మీ సమస్యలు ఏవైనా ఉంటే రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించొచ్చు కదా అని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర సీఎస్ పదో షెడ్యూలు సంస్థలకు సంబంధించి వేసిన వాదన తప్పని ఆంధ్రప్రదేశ్ సీఎస్, అడ్వోకేట్ జనరల్ గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మీ రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకోవచ్చు కదా అన్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 రాజకీయ వేడిని రాజేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సెక్షన్ 8, సెక్షన్ 8 తెరపైకి వచ్చాయి. అనంతరం పదో షెడ్యూల్ తెరపైకి వచ్చింది. వీటిపై తెలంగాణ, ఏపీల మధ్య వివాదం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications