ఆ ఉత్తరాలు చదివితే కళ్లు చెమ్మగిల్లేవి: గవర్నర్ ఉద్వేగం (పిక్చర్స్)

హైదరాబాద్: మనియార్డర్, టెలిగ్రామ్ వంటి పాత సంప్రదాయ తపాలా సేవలను రద్దు చేయడం చాలా బాధాకరమని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం అన్నారు. వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో తపాలా శాఖలో ప్రజలకు విశిష్టమైన సేవలను అందించిన ఉద్యోగులు, అధికారులకు డాక్ సేవా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడారు.

కంప్యూటర్ యుగంలో రకరకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తపాలా శాఖ కొన్ని ఒడిదుడుగులు ఎదుర్కొందన్నారు.

నరసింహన్

నరసింహన్

ఒకప్పుడు పోస్టు కార్డు, ఇన్‌లాండ్ ఉత్తరాలు ప్రజల మధ్య ఆత్మీయానుబంధాలను పెంచితే.. సెల్ ఫోను, ఇంటర్నెట్ వంటి ఆధునిక మాధ్యమాలు మనుషుల మధ్య దూరం పెంచుతున్నాయన్నారు.

నరసింహన్

నరసింహన్

ఉత్తరంలో ఒక్కో అక్థరం చదువుతుంటే మనసు తేలికై ఉద్వేగంతో కళ్లు చెమ్మగిల్లేవన్నారు. ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ వంటి సాధానాలతో అర్థం కాని భాషలో సమాచారం వేగంగా చేరుతోందని కానీ, ఉత్తరంలోని ఆప్యాయత అందులో దొరకదన్నారు.

నరసింహన్

నరసింహన్

నాటి ఉత్తరాల ద్వారా మధురస్మృతులు దాచుకునే అవకాశం ఉందని గవర్నర్ నరసింహన్ చెప్పారు.

 నరసింహన్

నరసింహన్

1981లో మాస్కోలో ఉన్న తన సోదరుడు తనకు ఓ ఉత్తరం రాశాడని, ఆ తర్వాత బాంబు పేలుళ్లలో అతను చనిపోయాడని, కానీ అతను రాసిన ఉత్తరం ఇప్పటికీ తన దగ్గర భద్రంగా ఉందని ఉద్వేగంతో చెప్పారు.

నరసింహన్

నరసింహన్

సెల్ ఫోన్ ద్వారా క్షణాల్లో డబ్బును ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు కానీ, మనియార్డర్ చేస్తే డబ్బుతో పాటు నాలుగు మాటలు రాయవచ్చునని, అవి చదివినప్పుడు కలిగే అనుభూతి వేరు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+