తెలంగాణ దిశగా జివోఎం: ఆయా మంత్రుల బాధ్యతలివే..
న్యూఢిల్లీ: మంత్రుల బృందం ఏర్పాటు, ఈ రోజు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో భేటీ జరిగిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనపై దూకుడుగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. శుక్రవారం భేటీ అయిన మంత్రివర్గం అన్ని అంశాల పైన భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తామని చెప్పడమే కాకుండా.. బృందంలోని సభ్యులకు విభజన నిర్ణయం నేపథ్యంలో బాధ్యతలు అప్పగించారు. దీంతో విభజన వైపు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. విభజన నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమైన అంశాల పైన భాగస్వామ్య పక్షాలతో అభిప్రాయ సేకరణ జరుపుతామని తెలిపారు. అందరి అభిప్రాయాలతోనే కేంద్రానికి తాము నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.

విధివిధానాల పైన ప్రభుత్వ శాఖల నుండి సమాచారం సేకరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుండి కూడా సమాచారం సేకరిస్తామని చెప్పారు. అందర్నీ సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. మంత్రుల బృందానికి కాలపరిమితి లేదని ఆజాద్ తెలిపారు.
మంత్రుల బృందంలోని సభ్యులకు బాధ్యతలు అఫ్పగించారు.
సుశీల్ కుమార్ షిండే - హైదరాబాద్, శాంతిభద్రతలు
నారాయణ స్వామి - ఉద్యోగుల పంపిణీ
గులాం నబీ ఆజాద్ - వైద్యం, విద్యా, ఉపాధి
వీరప్ప మొయిలీ - న్యాయపరమైన అంశాల బాధ్యత
చిదంబరం - ఆర్థికపరమైన అంశాల బాధ్యత
ఎకె ఆంటోనీ - రక్షణ, సరిహద్దు, నియోజకవర్గాల కేటాయింపుతో పాటు ఇతర బాధ్యతలు
జైరాం రమేష్ - జలవనరుల సమస్యలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ












Click it and Unblock the Notifications