ప్రభుత్వ ఉద్యోగులు - పెన్షనర్లకు గుడ్ న్యూస్..!!
ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) మార్చిలో 4 శాతం పెరగనుంది. ఈ పెంపు తరువాత డీఆర్(DR), డీఏ 50 శాతానికి పైగా చేరుకుంటుంది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. మార్చి 3న జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త వినబోతున్నారు. కరువు భత్యం నాలుగు శాతం పెంచేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌లను ప్రభుత్వం ఆమోదించింది. 2022-2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్‌ల (అడ్ హాక్ బోనస్‌లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది .

దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయిస్తారు.
డీఏ మూల వేతనంలో 50.25 శాతానికి సమానంగా ఉంటుంది. ప్రతి నెల పీఐ- ఐడబ్ల్యూ డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ విభాగమైన లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది. డీఏ ఉద్యోగులకు ఇవ్వనుండగా.. డీఆర్ పెన్షనర్లకు చెల్లిస్తారు. డీఏ, డీఆర్‌ను సంవత్సరానికి రెండుసార్లు జనవరి, జులైలో ప్రకటిస్తారు. ఇక, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications