కృష్ణాజలాలపై వాటర్ ఏరోడ్రోమ్: ప్రకాశం బ్యారేజీపై: ఏపీ బీజేపీ అలర్ట్..కేంద్రానికి థ్యాంక్స్
విజయవాడ: రాష్ట్రంలో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు కానుంది. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా 14 చోట్ల ఈ వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మితం కానున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రాష్ట్రానికి వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, షిప్పింగ్ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు కృతజ్ఞతలు తెలియజేస్తోన్నారు.
వాటర్ ఏరోడ్రోమ్- నీటిపై తేలియాడే విమానాశ్రయం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణాజలాలపై దీన్ని నిర్మించబోతోంది కేంద్ర ప్రభుత్వం. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా దీని నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలిదశలో దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటిని అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికోసం 450 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. సముద్ర జలాలపై ల్యాండ్ అయ్యే, టేకాఫ్ తీసుకునే తేలికపాటి విమానాలను ఈ 14 చోట్ల నడిపించనుంది. ఈ తరహా ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చేపట్టింది.

గుజరాత్‌లోని కెవాడియా వద్ద నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం సమీపంలో శబర్మతి నదిపై దీన్ని నిర్మిస్తోంది. అదే తరహాలో- ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ డ్యామ్, అస్సాంలోని గువాహటి సమీపంలో గల ఉమ్రాంగ్‌సొ రిజర్వాయర్, మహారాష్ట్రలోని ఖిండ్సి, ఎరాయ్ డ్యామ్స్, ఏపీలోని ప్రకాశం బ్యారేజీ, లక్షద్వీప్‌లోని మినికోయ్, అండమాన్ నికోబార్‌లోని హేవ్‌లాక్, నెయిల్, హ్యూట్‌బే, గుజరాత్‌లోని ధరోయ్, శతృంజయ వద్ద వాటర్ ఏరోడ్రోమ్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది.
తెలంగాణ,ఏపీ కి కేంద్రప్రభుత్వం మరో పర్యాటక సహకారం అందించినందుకు ధన్యవాదాలు
— S.Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 18, 2021
సాగరమాల ప్రాజెక్ట్‌లో దేశవ్యాప్తంగారూ.450 కోట్లతో 14చోట్ల వాటర్ ఏరోడ్రోమ్‌లను కేంద్రం మంజూరుచేసింది.ఇందులో విజయవాడ, నాగార్జున సాగర్ ను ఎంపిక చేసింది.నీటిపై తేలియాడే విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది pic.twitter.com/MRbdX1B3tR
Recommended Video
ప్రకాశం బ్యారేజీ వద్ద నిర్మితమయ్యే ప్రాజెక్ట్‌ను ఉడాన్ పథకం కిందికి చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన సర్వే చేపట్టనుంది. రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయడం వల్ల బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల సముద్ర ఆధారిత పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పారు. రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని ఈ ప్రాజెక్టు అందిస్తుందని పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications