‘రోజా! నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే తీవ్ర పరిణామాలు’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఎమ్మెల్సీ, టిడిపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఎమ్మెల్సీ, టిడిపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉనికిని కాపాడుకోవడానికే నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రిని విమర్శిస్తోందని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. రోజా నోటి దురుసువల్లే అసెంబ్లీలో సస్పెండ్ అయిందన్నారు. కోర్టుకు వెళ్లినా న్యాయమే గెలవడంతో ఆమె స్పీకర్‌కు క్షమాపణ చెప్పిన విషయం మరచినట్టుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబును రాయలసీమ ద్రోహి అవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువస్తుంటే ఉభయ గోదావరి, కృష్ణా వాసులను జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదా? అని ధ్వజమెత్తారు. అంతేగాక, రాయలసీమకొచ్చి పట్టిసీమ నీళ్లు రావని ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ.. జగన రెండు నాలుకల దోరణి ప్రదర్శిస్తున్నాడని దుయ్యబట్టారు.
రూ. 470 కోట్లతో ప్రారంభించిన సుజల స్రవంతి కాలువ పనులు 85 శాతం పూర్తయ్యాయని ఈ కాలువ ద్వారా కుప్పానికి నీటి సమస్య తీర్చనున్నామన్నారు. చిత్తూరు జిల్లాను పారిశ్రామికంగానూ, ప్రత్యేకించి తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications