ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..!
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్లు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎలెక్షన్స్ విధుల్లో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయినా కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, పార్టీ ప్రచారాల్లో పాల్గొంటూ కనిపించారు. దీంతో వాలంటీర్లపై టీడీపీ నేతలు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అధికారులను కోరారు.
మరోవైపు వాలంటీర్లపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేత బొజ్జల సుధీర్ వాలంటీర్లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బొజ్జల సుధీర్ స్థానికంగా మాట్లాడుతూ వాలంటీర్లను జిహాదీలతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. తమపై చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వాలంటీర్లు భారీ ఎత్తున రాజీనామా చేశారు. తాము వాలంటీర్లుగా ఉండటం కంటే జగనన్న వారియర్స్‌గా ఉండటానికే ఇష్టపడతామని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు.
జగనన్న కోసం త్యాగం చేస్తున్నామని చెబుతూ వాలంటీర్లు రాజీనామా చేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. రాజీనామా చేస్తున్నట్లు కమిషనర్‌కు తమ రాజీనామా పత్రాలు అందజేశారు. మరోవైపు వాలంటీర్లను తమవైపు తిప్పుకోవాలని టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు.
వాలంటీర్ల గౌరవ వేతనంతో పాటు, నెలకు రూ.30 వేలు నుంచి రూ. 50 వేలు వరకు వచ్చేలా ఉద్యోగ కల్పన చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని వైసీపీ నేతలు చేస్తోన్న ప్రచారాన్ని చంద్రబాబు ఖండించారు. దీంతో ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ల చూట్టు తిరుగుతున్నాయి. ఇదే సమయంలో వాలంటీర్లు భారీ ఎత్తున రాజీనామా చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications