దుమ్ము దులుపుతున్న తెలుగుదేశం పార్టీ ''మినీ మ‌హానాడులు!!''

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న మినీ మ‌హానాడుల‌కు ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. చోడ‌వ‌రంలో జ‌రిగిన మినీ మ‌హానాడుకానీ, మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన మినీ మ‌హానాడు కానీ ఇందుకు అద్దం ప‌డుతున్నాయి. మ‌ద‌న‌ప‌ల్లెలో జోరున వ‌ర్షం కురుస్తున్నా లెక్క‌చేయ‌కుండా ప్ర‌జ‌లు హాజ‌రుకావ‌డం, బాబు ప్ర‌సంగాన్ని శ్ర‌ద్ధ‌గా విన‌డం విశేష‌మే.

మహానాడుతో తెలుగుదేశం పార్టీలో పెరిగిన ఉత్సాహం

మహానాడుతో తెలుగుదేశం పార్టీలో పెరిగిన ఉత్సాహం

మే 28, 29 తేదీల్లో ఒంగోలులో మ‌హానాడు జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డానికి ఈ కార్య‌క్ర‌మానికి బ‌స్సులు స‌మ‌కూర్చ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌గా, నిరాక‌రించింద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు స్వ‌చ్ఛంధంగా సొంత వాహ‌నాల్లో త‌ర‌లి రావ‌డం, కార్య‌క్ర‌మం అనూహ్య విజ‌యం సాధించ‌డంతో టీడీపీలో జోష్ పెరిగిపోయింది. అంచ‌నాల‌కు మించి విజ‌య‌వంత‌మైన మ‌హానాడు స్ఫూర్తిని ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఏడాది పొడ‌వునా కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

 మినీ మహానాడులకు శ్రీకారం

మినీ మహానాడులకు శ్రీకారం


దీంతో ఎప్పుడూ లేనివిధంగా అన్ని జిల్లాలో మినీ మ‌హానాడుల నిర్వ‌హ‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఒక్కో జిల్లాలో ఒక్కో మ‌హానాడుకు ఒక్కో పేరు పెట్టుకుంటూ వ‌స్తున్నారు. మ‌ద‌న‌ప‌ల్లిలో జ‌రిగిన మినీ మ‌హానాడుకు 'ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా' అనే పేరు పెట్టారు. జోరున కురుస్తున్న వ‌ర్షంలోను పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లిరావ‌డం చూసే రాయ‌ల‌సీమ‌కు చెందిన వైసీపీ నేత‌లంతా చంద్ర‌బాబునాయుడిపై విరుచుకుప‌డుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరగవచ్చు?

ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరగవచ్చు?


ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న 'గ‌డ‌ప గ‌డ‌ప‌కు మీ ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత ఏ క్ష‌ణంలోనైనా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలు అంచ‌నా వేస్తున్నాయి. దీంతో పార్టీని మ‌రింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాలంటే మినీ మ‌హానాడులే అందుకు మార్గ‌మ‌ని, అన్ని జిల్లాల‌ను క‌వ‌ర్ చేసిన‌ట్ల‌వుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండి, ఇప్పుడు దూరంగా ఉన్న‌వారిని దూరంగానే ఉంచుతూ క‌లిసివ‌చ్చేవారితోనే ముందుకు వెళుతున్నారు. త‌నంత‌ట‌ తాను గా చంద్ర‌బాబు జోరుగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండటంతో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తండోప తండాలుగా త‌ర‌లివ‌స్తున్నారు.

ఎన్నికలు ఎదుర్కోవడానికి సులవైన మార్గం

ఎన్నికలు ఎదుర్కోవడానికి సులవైన మార్గం


త‌ర్వాత మినీ మ‌హానాడు ఎక్క‌డ‌నేది ప్ర‌క‌టిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌టి ఇలాగే ఘ‌నంగా విజ‌య‌వంత‌మైతే అధికారంలోకి రావ‌డం సులువ‌ని, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు సంబ‌రంగా చెబుతున్నారు. వీటిని విజ‌య‌వంతం చేయ‌డంద్వారా ఎన్నిక‌ల‌ను సులువుగా ఎదుర్కోవ‌చ్చ‌నే బాబు వ్యూహం ఫ‌లించే అవకాశం ఉందని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+