గ్రూప్-2 పరీక్షలపై ట్విస్ట్ ఇచ్చిన ఏపీపీఎస్సీ
గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న (ఆదివారం) జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. . గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఏపీపీఎస్సీ రియాక్ట్ అయింది

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది.దీంతో ఫిబ్రవరి 23న (ఆదివారం) జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ తెలిపింది.గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్ సూచించింది.అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications