ఏపీలో రికార్డు స్థాయి ఆదాయం

అమరావతి: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌లో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ రెవెన్యూ నమోదైంది. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 10 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి జోరందుకున్నాయి.

సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,62,712 కోట్ల రూపాయలు. 2023 ఇదే సెప్టెంబర్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య 10 శాతం అధికం. ఇందులో సీజీఎస్టీ వాటా 29,818 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 37,657 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 83,623 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.

GST collections in September 2023 records Rs 1,62,712 crore, AP posts Rs 3,658 Cr

దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 41,145 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 11,613 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 881 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి పెరిగాయి. ఈ పెరుగుదల 17 శాతంగా నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఏపీలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 3,132 కోట్ల రూపాయలు.. కాగా ఇప్పుడు ఈ సంఖ్య 3,658 కోట్ల రూపాయలుగా నమోదైంది. తెలంగాణతో పోల్చుకుంటే ఇది తక్కువే. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 33 శాతంగా నమోదైంది.

ప్రతి నెలా 3,000- 3,500 కోట్ల రూపాయలకు ఏ మాత్రం తగ్గట్లేదు ఏపీలో నమోదవుతున్న జీఎస్టీ కలెక్షన్లు. ఈ విషయంలో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతోంది. రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.563 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.784 కోట్లు, పంజాబ్-రూ.1,866 కోట్లు, చండీగఢ్-రూ.219 కోట్ల రూపాయల ఆదాయం అందింది.ఉత్తరాఖండ్-రూ.1,392 కోట్లు, హర్యానా-రూ.8,009 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-4,849 కోట్లు, రాజస్థాన్-3,869 కోట్లుగా నమోదయ్యాయి. ఉత్తర ప్రదేశ్-రూ.7,844 కోట్లు, బిహార్-రూ.1,397 కోట్లు, సిక్కిం-రూ.315 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.81 కోట్లు, నాగాలాండ్-రూ.52 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.

మణిపూర్-రూ.56 కోట్లు, మిజోరం-రూ.27 కోట్లు, త్రిపుర-రూ.73 కోట్లు, మేఘాలయ-రూ.165 కోట్లు, అస్సాం-రూ.1,175 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,940 కోట్లు, జార్ఖండ్-రూ.2,623 కోట్లు, ఒడిశా-4,249 కోట్లుగా రికార్డయ్యాయి. ఛత్తీస్‌గఢ్-2,684, మధ్యప్రదేశ్-రూ.3,118 కోట్ల రూపాయలు.డయ్యూ డామన్/దాద్రానగర్ హవేలి-రూ.350 కోట్లు, గుజరాత్-10,129 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.25,137 కోట్లు, కర్ణాటక-రూ.11,693 కోట్లు, గోవా-రూ.497 కోట్లు, కేరళ-రూ.2,505 కోట్లు, తెలంగాణ- రూ.5,226 కోట్లు, తమిళనాడు-రూ.10,481 కోట్లు, పుదుచ్చేరి-రూ.197 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.23 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+