వారెవ్వా..ఏపీ- అదరగొట్టిందిగా..!!

ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 1,49,577 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఏపీలో 3,557 కోట్ల రూపాయలు, తెలంగాణ 4,424 కోట్ల రూపాయలుగా రికార్డయింది.

అమరావతి: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ రెవెన్యూ నమోదైంది. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 12 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 13 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో ఈ సంఖ్య ఎనిమిది శాతానికే పరిమితమైంది.

ఐజీఎస్టీ వాటా..

ఐజీఎస్టీ వాటా..

ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,49,577 కోట్ల రూపాయలు. 2022 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈ సంఖ్య 12 శాతం అధికం. గత ఏడాది ఫిబ్రవరిలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 98,550 కోట్ల రూపాయలు. జీఎస్టీ రాబడి 1,40,000 కోట్ల రూపాయల మార్క్ ను దాటుకోవడం వరుసగా ఇది 12వ నెల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బ్రేకప్ ఇదీ..

బ్రేకప్ ఇదీ..

జీఎస్టీ ఆదాయంలో అధిక వాటా ఐజీఎస్టీదే. సీజీఎస్టీ వాటా 27,662 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 34,915 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 75,069 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 35,689 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 11,931 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 792 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.

ఏపీలో పెరుగుదల..

ఏపీలో పెరుగుదల..

ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల 13 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో వచ్చిన జీఎస్టీ వసూళ్లు 3,157 కోట్ల రూపాయలు.. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 3,557 కోట్ల రూపాయలుగా నమోదైంది. తెలంగాణతో పోల్చుకుంటే అయిదు శాతం అధికంగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు ఎనిమిది శాతం.

తెలంగాణ కంటే..

తెలంగాణ కంటే..

ఫిబ్రవరిలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 4,424 కోట్ల రూపాయలు. గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో 4,113 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో అందాయి. ప్రతి నెల కూడా తెలంగాణ కంటే ఏపీలో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు నమోదవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. హైదరాబాద్ వంటి నగర్ ఏపీకి లేకపోయినప్పటికీ- రెవెన్యూ ఏనెలకానెల భారీగా పెరుగుతోండటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న సానుకూల విధానాలకు అద్దం పట్టినట్టవుతోంది.

రాష్ట్రాలవారీగా..

రాష్ట్రాలవారీగా..

రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.434 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.691 కోట్లు, పంజాబ్-రూ.1,651 కోట్లు, చండీగఢ్-రూ.188 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,405 కోట్లు, హర్యానా-రూ.7,310 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-4,769 కోట్లు, రాజస్థాన్-3,941 కోట్లు, ఉత్తర ప్రదేశ్-రూ.7,431 కోట్లు, బిహార్-రూ.1,499 కోట్లు, సిక్కిం-రూ.265 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.78 కోట్లు, నాగాలాండ్-రూ.54 కోట్లు, మణిపూర్-రూ.64 కోట్లు, మిజోరం-రూ.58 కోట్లు, త్రిపుర-రూ.79 కోట్లుగా నమోదయ్యాయి.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో..

మేఘాలయ-రూ.189 కోట్లు, అస్సాం-రూ.1,111 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,955 కోట్లు, జార్ఖండ్-రూ.2,962 కోట్లు, ఒడిశా-4,101 కోట్లు, ఛత్తీస్‌గఢ్-3,009 కోట్ల రూపాయల మేర జీఎస్టీ రెవెన్యూను అందుకున్నాయి. మధ్యప్రదేశ్-రూ.3,235 కోట్లు, దాద్రానగర్ హవేలి-రూ.283 కోట్లు, గుజరాత్-9,574 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.22,349 కోట్లు, కర్ణాటక-రూ.10,809 కోట్లు, గోవా-రూ.493 కోట్లు, కేరళ-రూ.2,326 కోట్లు, తమిళనాడు-రూ.8,774 కోట్లు, పుదుచ్చేరి-రూ.188 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.31 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+