vastu tips: వాస్తుకు సంబంధించిన లేటెస్ట్ టిప్స్ వచ్చాయి.. తెలుసుకోండి!
ఇంటికి సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను తీసుకురావడానికి ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న కొన్ని లేటెస్ట్ వాస్తు టిప్స్, వాస్తు ఐటమ్స్ వివరాలు తెలుసుకొని వాటిని అనుసరిద్దాం. మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం. నిపుణులు చెబుతున్న లేటెస్ట్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
హిమాలయన్ రాక్ సాల్ట్ లాంప్
ప్రస్తుతం ఇది చాలా పాపులర్ వాస్తు ఐటమ్. దీనిని లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌లో ఉంచడం వల్ల గదిలోని నెగెటివ్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తొలగిపోయి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

లాఫింగ్ బుద్ధ
ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కొంత ఎత్తులో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల సంపద, సంతోషం లభిస్తాయి. ముఖ్యంగా చేతులు పైకెత్తి ఉన్న లేదా మూట పట్టుకున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాలు మంచి ఫలితాలనిస్తాయి.
తాబేలు, కప్ప విగ్రహం
ఇత్తడి లేదా స్పటికం తో చేసిన తాబేలును ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచాలి. నోట్లో నాణెం ఉన్న మూడు కాళ్ల కప్ప ను ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తున్నట్లుగా ప్రధాన ద్వారం లోపలి వైపు ఉంచడం వల్ల ఆర్థిక వృద్ధి ఉంటుంది.
వాటర్ ఫౌంటెన్
ఇంటికి ఈశాన్యం లేదా ఉత్తర దిశలో చిన్న వాటర్ ఫౌంటెన్ ఉంచడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. అయితే, నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి, నిలిచిపోకూడదు.
క్రిస్టల్ బాల్స్
లివింగ్ రూమ్ లేదా ఆఫీస్ రూమ్ కిటికీల దగ్గర స్పటికపు బంతులను వేలాడదీయడం వల్ల సూర్యరశ్మి వాటిపై పడి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.
ఇంటి అలంకరణ, నిర్వహణ
ఇంటి సింహద్వారం ఎల్లప్పుడూ వెలుతురుతో ప్రకాశిస్తూ ఉండాలి. గుమ్మానికి స్వచ్ఛమైన మామిడి ఆకుల తోరణం లేదా బంతిపూల తోరణం కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద అందమైన, స్పష్టంగా కనిపించే నేమ్ ప్లేట్ అమర్చడం వల్ల కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
లివింగ్ రూమ్ & రంగులు
ప్రస్తుతం ముదురు రంగుల కంటే లైట్ కలర్స్ ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి వాస్తు పరంగా కూడా ఇంటికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
ఇండోర్ ప్లాంట్స్
ఈశాన్య దిశలో మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ లేదా లక్కీ బాంబూ ప్లాంట్స్ పెంచడం వల్ల ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలతో పాటు పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. క్యాక్టస్/బోన్సాయ్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో పెట్టకూడదు.
వంటగది & బెడ్‌రూమ్
వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉండాలి. స్టవ్, సింక్ పక్కపక్కనే ఉండకూడదు, ఎందుకంటే నిప్పు, నీరు వ్యతిరేక శక్తులు.
బెడ్‌రూమ్‌లో అద్దాలు
పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దాలు ఉండకూడదు. పడుకున్నప్పుడు మీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని వాస్తు చెప్తోంది. ఒకవేళ అద్దం ఉంటే, పడుకునే ముందు దానిపై క్లాత్ కప్పండి.
ఆర్థిక వృద్ధి కోసం చిన్న చిట్కా
ఇంటి నైరుతి మూలలో ధనానికి సంబంధించిన బీరువా లేదా లాకర్‌ను ఉంచాలి. బీరువా తలుపులు తెరిచినప్పుడు అవి ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉండాలి. కుబేరుడి దిశ ఉత్తరం కాబట్టి సంపద స్థిరంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications