డిప్యూటీ సీఎంగా రాఘవ లారెన్స్?
తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ హీరో దళపతి విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సినీ ప్రముఖుల రాజకీయ జోక్యం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే దళపతి విజయ్ ఇటీవల ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాఘవ లారెన్స్ త్వరలోనే విజయ్ నేతృత్వంలోని టీవీకీ పార్టీలో అధికారికంగా చేరి.. తన ఎన్నికల ప్రచారానికి గ్రౌండ్ సిద్ధం చేసుకోనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే ప్రస్తుతం రాఘవ లారెన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో కారణంగా నెట్టింట దారుణంగా ట్రోల్ అవుతున్నారు. రాఘవ లారెన్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ ఏఐ జనరేటెడ్ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన తమిళనాడు ఉపముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ ముందు కూర్చుని ఉన్నట్లు ఉంది. రాఘవ లారెన్స్‌కు ఆ పదవిని చేపట్టాలనే బలమైన ఆకాంక్ష ఉందనే విషయాన్ని ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది. ఓ అధికారిక ఖాతా నుంచి ఇలాంటి ఫోటో రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రాఘవ లారెన్స్‌ను ఆటాడుకుంటున్నారు. రాఘవ లారెన్స్ ఇంకా ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు.. కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలవలేదు.. అప్పుడే సీఎం విజయ్ పక్కన తదుపరి డిప్యూటీ సీఎం తానే అన్నట్లు ముందుగానే ఇలా ఏఐ ఫోటోలను షేర్ చేయడం ఎవరికీ నచ్చడం లేదు. ఇలాంటి పోస్టుల వల్ల నెగెటివిటీ వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి సీఎం విజయ్ ఈ విషయంపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications