వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో జీఎస్టీ వసూళ్ల దూకుడు: మరోసారి ఆ రికార్డ్: రాష్ట్రాలవారీగా బ్రేకప్ ఇదే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల (GST) వసూళ్లు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 28 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జూన్‌తో వసూళ్లతో పోల్చుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ పెరిగింది. ఇక ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 25 శాతం మేర అధికంగా ఈ వసూళ్లు రికార్డయ్యాయి.

సర్పంచ్ భార్యను చెరబట్టిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి: నిర్బంధించి..రేప్సర్పంచ్ భార్యను చెరబట్టిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి: నిర్బంధించి..రేప్

 ఐజీఎస్టీ వాటా..

ఐజీఎస్టీ వాటా..

జూన్‌లో జీఎస్టీ వసూళ్లు- 1,44,616 కోట్ల రూపాయలు. నెల తిరిగే సరికి ఈ సంఖ్య మరింత పెరిగింది. జులైలో 1,48,995 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో సీజీఎస్టీ వాటా 25,751 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 32,807 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 79,518 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. సెస్ రూపంలో అందిన మొత్తం 10,920 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 995 కోట్ల రూపాయలు ఇందులోనే విలీనమైంది.

 ఏపీలో పెరుగుదల..

ఏపీలో పెరుగుదల..

కాగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా చోటు చేసుకున్నాయి. ఈ పెరుగుదల శాతం 25గా నమోదైంది. గత ఏడాది ఇదే జులైలో వచ్చిన జీఎస్టీ వసూళ్లు 2,730 కోట్ల రూపాయలు. ఈ ఏడాది అదే నెలలో ఈ సంఖ్య 3,409 కోట్ల రూపాయలకు పెరిగింది. రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.431 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.746 కోట్లు, పంజాబ్-రూ.1,733 కోట్లు, చండీగఢ్-రూ.176 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,390 కోట్లు, హర్యానా-రూ.6,791 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి.

 పశ్చిమ బెంగాల్‌లో..

పశ్చిమ బెంగాల్‌లో..

ఢిల్లీ-4,327 కోట్లు, రాజస్థాన్-3,671 కోట్లు, ఉత్తర ప్రదేశ్-రూ.7,074 కోట్లు, బిహార్-రూ.1,264 కోట్లు, సిక్కిం-రూ.249 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.65 కోట్లు, నాగాలాండ్-రూ.42 కోట్లు, మణిపూర్-రూ.45 కోట్లు, మిజోరం-రూ.26 కోట్లు, త్రిపుర-రూ.63 కోట్లు, మేఘాలయ-రూ.138, అస్సాం-రూ.1,040 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.4,441 కోట్లు, జార్ఖండ్-రూ.2,514 కోట్లు, ఒడిశా-3,652 కోట్లు, ఛత్తీస్‌గఢ్-2,695 కోట్ల రూపాయల మేర జీఎస్టీ రెవెన్యూను అందుకున్నాయి.

మహారాష్ట్రలో అదే దూకుడు..

మహారాష్ట్రలో అదే దూకుడు..

మధ్యప్రదేశ్-రూ.2,966 కోట్లు, దాద్రానగర్ హవేలి-రూ.313 కోట్లు, గుజరాత్-9,183 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.22,129 కోట్లు, కర్ణాటక-రూ.9,795 కోట్లు, గోవా-రూ.433 కోట్లు, లక్షద్వీప్-రూ.2 కోట్లు, కేరళ-రూ.2,161 కోట్లు, తమిళనాడు-రూ.8,449 కోట్లు, పుదుచ్చేరి-రూ.198 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.23 కోట్లు, తెలంగాణ-రూ.4,547 కోట్లు, లఢక్-రూ.20 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

English summary
GST revenue collected in July 2022 records as ₹1,48,995 crore. Andhra Pradesh posts Rs 3,409 Crore in the same month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X