ఏపీ- అదరగొట్టింది..!!

అమరావతి: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. జులైలో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ రెవెన్యూ నమోదైంది. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 11 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి జోరందుకున్నాయి.

జులైలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,65,105 కోట్ల రూపాయలు. 2022 జులైతో పోల్చుకుంటే ఈ సంఖ్య 11 శాతం అధికం. ఇందులో సీజీఎస్టీ వాటా 29,773 కోట్ల రూపాయలు. ఎస్‌జీఎస్టీ- 37,623 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 85,930 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.

GST revenue in July 2023 records Rs 165105 crore, AP posts Rs 3593 Cr

దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 41,239 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 11,779 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 840 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.

ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి పెరిగాయి. ఈ పెరుగుదల అయిదు శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో వచ్చిన జీఎస్టీ వసూళ్లు 3,409 కోట్ల రూపాయలు.. కాగా ఈ ఏడాది జులైలో జీఎస్టీ వసూళ్లు 3,593 కోట్ల రూపాయలుగా నమోదైంది. తెలంగాణతో పోల్చుకుంటే రెండు శాతం తక్కువగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు ఏడు శాతం.

రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.549 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.917 కోట్లు, పంజాబ్-రూ.2,000 కోట్లు, చండీగఢ్-రూ.217 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,607 కోట్లు, హర్యానా-రూ.7,953 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-5,405 కోట్లు, రాజస్థాన్-3,988 కోట్లుగా నమోదయ్యాయి.

ఉత్తర ప్రదేశ్-రూ.8,802 కోట్లు, బిహార్-రూ.1,488 కోట్లు, సిక్కిం-రూ.314 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.74 కోట్లు, నాగాలాండ్-రూ.43 కోట్లు, మణిపూర్-రూ.42 కోట్లు, మిజోరం-రూ.39 కోట్లు, త్రిపుర-రూ.78 కోట్లు, మేఘాలయ-రూ.175 కోట్లు, అస్సాం-రూ.1,183 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.5,1285 కోట్లు, జార్ఖండ్-రూ.2,859 కోట్లు, ఒడిశా-4,245 కోట్లుగా రికార్డయ్యాయి.

ఛత్తీస్‌గఢ్-2,805, మధ్యప్రదేశ్-రూ.3,325 కోట్లు, డయ్యూ డామన్/దాద్రానగర్ హవేలి-రూ.354 కోట్లు, గుజరాత్-9,787 కోట్లు రికార్డయ్యాయి. మహారాష్ట్ర-రూ.26,064 కోట్లు, కర్ణాటక-రూ.11,505 కోట్లు, గోవా-రూ.528 కోట్లు, కేరళ-రూ.2,381 కోట్లు, తమిళనాడు-రూ.10,022 కోట్లు, పుదుచ్చేరి-రూ.216 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.31 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+