చంద్రబాబుతో గుడివాడ నేతల భేటీ - కొడాలి నానిపై అభ్యర్ధి ఖరారు..!?

గుడివాడ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్ధి పైన రావి వేంకటేశ్వర రావు కీలక ప్రకటన చేసారు.

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీ-టీడీపీ అభ్యర్ధుల ఎంపిక పైన ఫోకస్ పెట్టాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీఎం జగన్ తన అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. సిట్టింగ్ లు అందిరికీ సీట్లు ఖరారు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇక..రాష్ట్రంలో అందిరూ ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గం గుడివాడ.

అక్కడ మాజీ మంత్రి కొడాలిని ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ లక్ష్యం. కొంత కాలంగా అక్కడ టీడీపీ అభ్యర్ధి ఎవరనే దాని పైన అనేక మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు నియోజకవర్గ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీ నుంచి కొడాలి నాని పైన పోటీ చేసే అభ్యర్ధి ఎవరనేది క్లారిటీ వచ్చింది.

టీడీపీ వర్సస్ కొడాలి నాని

టీడీపీ వర్సస్ కొడాలి నాని

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొడాలి నాని మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ లక్ష్యంగా ప్రధానంగా చంద్రబాబు - లోకేష్ ను టార్గెట్ చేస్తూ కొడాలి నాని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని పైన బలమైన అభ్యర్ధిని బరిలోకి దించి..ఓడించాలనే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇందు కోసం పలువురి పర్లు తెర మీదకు వచ్చాయి. నియోజకవర్గం లో పార్టీ మినీ మహానాలు నిర్వహణకు తొలుత నిర్ణయించినా..అక్కడి నేతల మధ్య అనైక్యత..ఇతర కారణాలతో వాయిదా పడింది. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిగా పలువురు రేసులో ఉన్నారు. అటు కొడాలి నాని టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా..ప్రజల మద్దతు తనకే ఉంటుందనే ధీమాతో ఉన్నారు.

గుడివాడ నుంచి కొడాలి నాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సమయంలోనే గుడివాడ నియోజకవర్గ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్ది గురించి నియోజకవర్గ ముఖ్య నేత కీలక ప్రకటన చేసారు.

టికెట్ నాదే - గెలిచేది నేనే

టికెట్ నాదే - గెలిచేది నేనే

చంద్రబాబుతో భేటీ తరువాత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు కీలక ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ టికెట్‌ తనదేనని, గెలి చేది కూడా తానేనని స్పష్టం చేసారు. పది రోజులుగా చంద్రబాబును కలవాలని అనుకున్నానని..తన పైన పెట్టిన అక్రమ కేసులు..అరెస్టుల కారణంగా కలవటం కుదరలేదన్నారు.

నియోజకవర్గంలో పరిస్థితులపైన చంద్రబాబుకు వివరించినట్లుగా చెప్పుకొచ్చారు. వాడలో నానీని ఢీకొట్టి టీడీపీ జెండాను తిరిగి రెపరెపలాడించే వ్యక్తిని తానేనన్నారు చంద్రబాబు ఇచ్చిన భరోసాతోనే తాను ముందుకు పోతున్నానన్నారు. తనకు టికెట్‌ ఇవ్వడంపై ఏ సందేహమూ లేదన్నారు.

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తన శక్తి మేర పని చేస్తున్నాని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్‌రెడ్డి, కొడాలి నానీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తన శక్తి మేర పని చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో పార్టీలో గ్రూపులు లేవని చెప్పుకొచ్చారు. అందరం కలిసి పని చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై నిలిపి నానీని ఓడిస్తానని రావి స్పష్టం చేశారు.

చంద్రబాబు హామీ ఇచ్చారా...

చంద్రబాబు హామీ ఇచ్చారా...

ఇప్పుడు రావి వెంకటేశ్వర రావు చేసిన ప్రకటన గుడివాడలో చర్చకు కారణమైంది. నియోజకవర్గంలో రావితో పాటుగా ఎన్నారై వెనిగండ్ల రాము మధ్య కొంత కాలంగా సీటు కోసం పోటీ నెలకొని ఉంది. ఇద్దరూ కలిసి కట్టుగా ఉన్నామని చెబుతున్నా..టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఇద్దరిలో ఒకరిని టీడీపీ నుంచి అభ్యర్ధిగా అవకాశం ఇస్తారా..కొత్తవారిని బరిలోకి దించుతారా అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబుతో భేటీ తరువాత రావి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటన మరింత ఆసక్తిని పెంచుతోంది. రావి వెంకటేశ్వర రావు గతంలోనూ కొడాలి నాని పైన పోటీ చేసి ఓడిపోయారు.

ఇప్పుడు టీడీపీకి గుడివాడ ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ...నియోజకవర్గంలో నేతల మధ్య అనైకత్య పార్టీకి సవాల్ గా మారుతోంది. ఈ సమయంలో ఇప్పుడు చంద్రబాబుతో భేటీ తరువాత రావి వెంకటేశ్వరరావు తానే పార్టీ అభ్యర్ధిగా వెల్లడించారు. దీని పైన పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+