విద్యార్థులకు ఏటా రూ.12 వేల స్కాలర్ షిప్ - అర్హతలు.. దరఖాస్తు ఇలా..!!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అరుదైన అవకాశం. పేద విద్యార్థుల ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దాంతో పాటు వారికి ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచనతో వారికి స్కాలర్ షిప్ అందిస్తోంది. దీనికి సంబంధించిన అర్హతలు.. మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా పరీక్ష నిర్వహిస్తోంది. అర్హత సాధించిన వారి విద్యార్ధుల ఖాతాల్లో ఏటా రూ 12 వేల చొప్పున వరుసగా నాలుగేళ్లు స్కాలర్ షిప్ రూపంలో ప్రభుత్వం మొత్తాన్ని అందించేందుకు నిర్ణయించింది.
ప్రతిభ ఉన్న విద్యార్ధులను ప్రోత్సహించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. స్కాలర్ షిప్ ద్వారా ఆర్దికంగా తోడ్పాటు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా 8వ తరగతి విద్యార్థులకు జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు నాలుగు సంవత్సరాల పాటు ఏటా రూ.12 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివితేనే స్కాలర్ షిప్ అందుతుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రెండు భాగాలుగా పరీక్ష ఉంటుంది. మొదటి విభాగంలో రీజనింగ్, అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే మెంటల్ ఎబిలిటీ పై ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో 7, 8 తరగతులకు సంబంధించిన సోషల్, జనరల్ సైన్సు, గణితానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

కాగా, ఒక్కో విభాగానికి సంబంధించి 90 మార్కులు చొప్పున మొత్తం 180 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వాటికి సంబంధించి న వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. జనరల్, బీసీ కేటగిరికి చెందిన వారు రూ.100, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ.50 పరీక్ష రుసుంను ఎస్బీఐలో చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష డిసెంబరు 7న నిర్వహించనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50లక్షల లోపు ఉన్నవారు మాత్రమే ఈ స్కాలర్ షిక్ కు అర్హులు.
ఈ స్కాలర్ షిప్ మంజూరు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిభ ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications