• search

గుజరాత్ రిజల్ట్స్ ఎఫెక్ట్: బాబుకు మోడీ అపాయింట్‌మెంట్, బిజెపి ప్లాన్ ఇదే

By Narsimha
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమరావతి: గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం బిజెపి అతి కష్టం మీద అధికారంలోకి రావడం ఏపీలో టిడిపికి కలిసివచ్చినట్టు కన్పిస్తోంది ఈ నెల 17వ, తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలను పంపారు.ఏడాది తర్వాత బాబు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

  గంటా సంచలనం: పోటీపై బాబుదే నిర్ణయం, ఆ ప్రకటన వెనుక వ్యూహమిదే

  బిజెపి, టిడిపి ఎంపీలు కేంద్రమంత్రుల నేతృత్వంలో రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఈ మేరకు రాష్ట్రానికి అవసరమైన సహయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు.

  ఈ నెల 17వ, తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి అందాల్సిన నిధులు ఇతరత్రా విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

  గుజరాత్ ఎన్నికల ఫలితాలు టిడిపికి కలిసొచ్చాయా

  గుజరాత్ ఎన్నికల ఫలితాలు టిడిపికి కలిసొచ్చాయా

  గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏపీ రాష్ట్రంలోని టిడిపికి కలిసొచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గుజరాత్ రాష్ట్రంలో బిజెపి తక్కువ మెజారిటీతో విజయం సాధించడం బిజెపి నాయకత్వాన్ని ఆత్మపరిశీలనలోకి నెట్టిందనే భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.ఇదే పరిస్థితి ఈ ఏడాది జరిగే 8 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్పన్నమైతే మిత్రపక్షాల మద్దతు అనివార్యం కానుంది. దీంతో మిత్రపక్షాలను ఇప్పటికిప్పుడే వదులుకోవడం సరికాదనే అభిప్రాయంతో బిజెపి జాతీయ నాయకత్వం ఉందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

  2019 ఎన్నికలకు ప్లాన్

  2019 ఎన్నికలకు ప్లాన్

  2019 ఎన్నికల కోసం బిజెపి ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. గత ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతు లేకున్నా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే దిశగా ఎంపీలను కైవసం చేసుకొంది. అయితే 2019 ఎన్నికల్లో కూడ ఎక్కువ సీట్లను సంపాదించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉత్పన్నమైతే ఎలా అనే విషయమై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అయితే మిత్రులు చేజారకుండా ఉండేలా బిజెపి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టిడిపితో సంబంధాలు దెబ్బతినకుండా ప్లాన్ చేస్తోంది.

  బాబు మోడీ భేటీ అందుకేనా

  బాబు మోడీ భేటీ అందుకేనా

  టిడిపి, బిజెపి ఎంపీలు కేంద్ర మంత్రులతో కలిసి ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్రానికి చెందిన సమస్యలను ప్రస్తావించడం పట్ల మోడీ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 17వ, తేదిన మోడీ చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు.ఈ పరిణామాలు బిజెపి వైఖరిని స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

  కేంద్రం నుండి సానుకూల సంకేతాలు

  కేంద్రం నుండి సానుకూల సంకేతాలు

  పోలవరం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వరకు హామీలు అమలు చేయనందుకు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా టీడీపీ సిద్ధమన్న సంకేతాలు కమలనాథులకు అందుతున్నాయి. దీంతో వారు పునరాలోచనలో పడ్డారు.నిన్నమొన్నటిదాకా పోలవరం ప్రాజెక్టును రకరకాలుగా అడ్డుతగిలిన కేంద్ర శాఖలు ఇప్పుడు ఆకస్మికంగా రాష్ట్రానికి సానుకూల నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం. టెండర్ల ప్రక్రియకు ఆమోదం, ఎన్‌హెచ్‌పీసీ నివేదికను తోసిపుచ్చి కాఫర్‌ డ్యాం నిర్మాణానికి పచ్చజెండా ఊపడం విశేషం.

  ఎలాంటి మార్పు లేదు

  ఎలాంటి మార్పు లేదు

  టీడీపీ పట్ల బీజేపీలో గతంలో, ఇప్పుడూ ఎలాంటి మార్పు లేదని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.తెలుగుదేశంతో ఎప్పుడూ స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోందని.. పోలవరంపై తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు.

  English summary
  Ap Chief Minister N Chandrababu Naidu is likely to meet Prime Minister Narendra Modi in New Delhi on 17 January to impress upon the PM the urgent need to implement the assurances made in the AP Reorganisation Act .

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more