విశాఖలో గన్ మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి
విశాఖపట్నం: నగరంలోని ఆర్పీఎఫ్ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ముసలయ్య (47) అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరొక పోలీసుకు తీవ్ర గాయలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోసుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
కేసీ ప్రధాన్ అనే కానిస్టేబుల్ 9ఎంఎం తుపాకీని శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తూ మిస్ పైర్ అయింది. దీంతో ఎదురుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ముసలయ్య పొట్టలొకి బుల్లెట్ దూసుకుపోయి, అతడివెనకున్న మరో పోలీసు మల్లిఖార్జునరావు వీపు భాగానికి కూడా తగిలింది.

గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఘటన జరిగిన తీరు కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిస్‌ఫైర్‌పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications