నకిలీ పురుగు మందుల రాజధానిగా గుంటూరు జిల్లా

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా అన్నిరకాల వస్తువుల నకిలీలకు, కల్తీలకు అడ్డాగా మారిందా? ఇక వ్యవసాయ రంగానికి సంబంధించైతే నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోలు ఇలా కాదేదీ కల్తీకి అనర్హం అన్న్టట్లుగా విచ్చలవిడి తయారీతో వీటికి రాజధానిలా తయారైంది జిల్లా పరిస్థితి. అందుకు నిదర్శనమే ఈ మధ్యకాలంలో ఇక్కడ వెలుగు చూస్తున్న డూప్లికేట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇటీవలే జిల్లాలో ఓ నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రం గుట్టు రట్టు అయింది.

ఇక్కడ ఒక ప్రముఖ కంపెనీ లోగోలు, డబ్బాలు, ఖాళీ కవర్లు తో పాటు గడువు ముగిసిన మందులను భారీ సంఖ్యలో అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. నంద్యాల కేంద్రంగా బళ్లారి నుంచి గుంటూరు దాకా ఈ రాకెట్‌ అనుసంధానమైవుందని తెలుస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు పిడుగురాళ్లలోని పెద్ద చెరువు వద్ద ఆర్‌ఎంపీ వైద్యుని ఇంట్లో వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

 పార్సిల్ కార్యాలయాల్లో గడువు ముగిసిన మందులు

పార్సిల్ కార్యాలయాల్లో గడువు ముగిసిన మందులు

వివిధ పార్శిల్‌ కార్యాలయాల్లో గడువు ముగిసిన మందులను తెచ్చి వాటితో ఈ మందులు తయారు చేస్తున్నారని వెల్లడైంది. నంద్యాల నుంచే ప్రముఖ కంపెనీలకు చెందిన ఖాళీ కవర్లను తెచ్చినట్లు కల్తీ మందుల వ్యాపారులు పోలీసులకు తెలపడం గమనార్హం. ఈ స్థావరంలో యూపీఎల్‌, బేయర్‌, మరికొన్ని ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ ఎరువులను తయారు చేస్తున్నారు. ట్రేసర్‌ - 75 ఎంఎల్‌, నెటీవో అనే పురుగు మందుల ఖాళీ కవర్లు, మందుతో నిండిన సీసాలను అధికారులు సీజ్‌ చేశారు. కల్తీ ఎరువుల వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా తాము ఎంతో ఖరీదు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ప్రముఖ కంపెనీల పురుగుమందులు నకిలీవని తెలుసుకున్న రైతులు నిర్ఘాంతపోతున్నారు. తమ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ నకిలీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 నకిలీలు విస్తరిస్తోందిలా..

నకిలీలు విస్తరిస్తోందిలా..

అసలు ఈ నకిలీ దందా సాగుతున్న తీరు పరిశీలిస్తే జిల్లా సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల వద్ద ఏదోవిధంగా మేనేజ్ జేసి ఇతర రాష్ట్రాల నుండి నకిలీ ఉత్పత్తుల ముడిపదార్థాలను ముందుగా జిల్లాలోకి చేరవేస్తున్నారు. వివిధ పార్శిల్‌ కార్యాలయాల్లో గడువు ముగిసిన మందులను తెచ్చి వాటితో ఈ మందులు తయారు చేస్తున్నారని వెల్లడైంది. ఆ తరువాత వాటిని తీసుకొచ్చి వివిధ ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకింగ్‌ చేసి కొందరు డీలర్లకు ఆకర్షణీయమైన కమీషన్ ఆశచూపి వారి ద్వారా పెద్దఎత్తున విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు మండలాల్లో ఆయా మందులు భారీ సంఖ్యలో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ నకిలీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారే తప్ప వ్యవసాయాధికారులు మాత్రం వాటిని గుర్తించలేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. అసలు ఒరిజినల్ కంపెనీ ఉత్పత్తులకు ఖచ్చితంగా బార్‌ కోడ్‌ ఉంటుంది. అయితే కొందరు డీలర్లు విక్రయించే ఉత్పత్తులకు బార్‌ కోడ్‌ పరిశీలించగా ఉండటంలేదు. గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతమని కాకుండా మాచర్ల, తెనాలి, రేపల్లె, వినుకొండ, నకిరేకల్లు ప్రాంతాలు ఈ నకిలీలకు అడ్డాలుగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న అక్రమార్కులు రాజకీయ పలుకుబడితో, అధికారుల అండదండలతో ఇలా నకిలీలను పెద్ద ఎత్తున తయారు చేస్తూ యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు.

 రైతులకు తీవ్రనష్టం..

రైతులకు తీవ్రనష్టం..

ఇక ఈ నకిలీ పురుగు మందుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేలాది రూపాయాలు వెచ్చించి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ మందులు పిచికారీ చేసినా ఎలాంటి ఫలితం ఉండట్లేదని వాపోతున్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన వరి, పత్తి, మిర్చి, కంది తదితర పంటల్లో ఇటీవల తెగుళ్ల ప్రభావం బాగా పెరుగుతోంది. ఇప్పటికే పలు రకాల తెగుళ్లు పంటలకు సోకి రైతుల గుండెల్లో కుంపటి రాజేశాయి. దీంతో ఇదే దనుగా ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు నకిలీ,కల్తీ మందుల తయారీదారులు సిద్ధమయ్యారు. ఈ ఏడాది అత్యధికంగా పత్తి పంటను 4.40 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా ఈ సీజన్‌లో గులాబీరంగు పురుగు పట్టింది. గత కొన్నేళ్లతో పోల్చితే ఈ ఏడాది పత్తిపంటపై గులాబీ పురుగు ప్రభావం అధికంగా ఉందని చెప్పొచ్చు. జిల్లాలో సుమారు 15 మండలాల వరకూ దీని ప్రభావం కనిపిస్తుంది. పురుగు ఉధృతి తగ్గించటానికి రైతులు పురుగుమందులు వాడుతున్నా పెద్దగా ఫలితం ఉండకపోకపోవటంతో దిగుబడి తగ్గటం, గుడ్డిపత్తి గా మారటం జరుగుతుంది. ఇలాంటి పత్తికి సరైన ధరలు రావని రైతులు వాపోతున్నారు. మరోవైపు మిర్చి పంటకూ ఇది కీలకమైన సమయం. రాబోయే రెండు నెలల పాటు మిర్చి పంటకు పురుగుమందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. రైతులు వేలరూపాయల విలువ చేసే మందులు వాడతారు. దీంతో నకిలీ మందుల బ్రోకర్లు మార్కెట్లో విస్తృతంగా విక్రయాలు జరిపేందుకు ఇప్పటికే సరుకు సిద్దం చేసుకొని ఉంటారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 వ్యవసాయశాఖ అధికారుల వాదన..

వ్యవసాయశాఖ అధికారుల వాదన..

అయితే వ్యవసాయ అధికారుల సహకారం వల్లనే ఈ కల్తీ,నకిలీల జోరు పెరిగిందనేది స్థానిక రైతుల ఆరోపణ.ఇక్కడి వ్యవసాయశాఖలో కింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీ చూడనట్లు వదిలేయటం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారుల సహకారం లేకుండా నకిలీల తయారీదారుల ఆటలు సాగవనే కుండబద్దలు కొడుతున్నారు. పైగా ఖరీఫ్‌ పంటలకు సంబంధించి పురుగుమందుల పిచికారీకి కీలకమైన సమయంలో వ్యవసాయ శాఖ ఉద్దేశ్యపూర్యకంగానే దాడులు తగ్గించిందని ఆరోపిస్తున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం తాము సమర్ధవంతంగానే పని చేస్తున్నామంటున్నారు. ఆ ప్రాంతపు వ్యవసాయ అధికారులతో కాకుండా అంతర్గత బృందాలతో తనిఖీలు చేయించడం, స్థానిక అధికారులను వారి డివిజన్లకు కాకుండా వేరే డివిజన్లకు కేటాయించడం వంటి చర్యలు తీసుకొని మరీ తనిఖీలు చేయిస్తున్నామని అంటున్నారు. అయితే తమ తనిఖీల్లో ఇటీవలికాంలో ఎక్కడా నకిలీలు పట్టుబడలేదని, ఎరువుల్లో కల్తీలు లేవని చెబుతున్నారు. తాము జరిపిన తనిఖీలకు సంబంధించి నివేదికలను ఉన్నతాధికారులకూ అందచేస్తామంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The raids conducted by the vigilance department exposed the huge market for adulterated agriculture products in the state. Adulteration of agriculture products has been increasing due to the demand. Taking advantage of the situation, the market for adulterated agriculture products is expanding in guntur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి