సీఎం జగన్ ఖాతాలో మరో విజయం

దేశం మొత్తం మీద నివాసానికి సౌకర్యవంతంగా ఉండే పట్టణాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు టాప్-10లో నిలిచాయి. గుంటూరు ఆరో స్థానం, విజయవాడ ఎనమిదో స్థానం, విశాఖపట్నం తొమ్మిదో స్థానంలో నిలిచాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఇటీవలే సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేద్వారా సేకరించారు.

గుంటూరు నుంచి 3,32,620 మంది సర్వేలో పాల్గొన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయస్థాయిలో 6వ ర్యాంకు ఈ నగరానికి లభించింది. విజయవాడ నుంచి 3.32 లక్షల మంది, విశాఖపట్నం నుంచి 2.88 లక్షల మంది సర్వేలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. గుంటూరు నుంచి 51.37 శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనడం కూడా ఈ నగరానికి కలిసివచ్చి ఆరో ర్యాంకు సాధించింది. విజయవాడ నుంచి 32.12 శాతం, విశాఖపట్నం నుంచి 16.72 శాతం చొప్పున ప్రజలు సర్వేలో భాగమయ్యారు.

guntur, vijayawada and vizag cities placed in ease of living survey ranks

ఈ ర్యాంకుల్లో మహారాష్ట్రలోని థానే, కర్ణాటకలోని బెంగళూరు, మధ్యప్రదేశ్ లోని భోపాల్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అటు పింప్రి చించ్వాడ్, మిరా, నవీ ముంబై, కల్యాన్ డోంబివాలి టాప్ 10లో నిలిచిన ఇతర పట్టణాలు. గుంటూరు మెరుగైన ర్యాంకును సాధించేందుకు అక్కడి మున్సిపల్ అధికార యంత్రాంగం ముందు నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల్లో సర్వే పట్ల అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చేయడంతోపాటు గుంటూరు మెరుగైన స్థానంలో నిలిస్తే అభివృద్ధికి నిధులు వస్తాయనే ప్రణాళికతో అధికారులు వ్యవహరించారు. ఈ ర్యాంకులు సాధించడంపై మూడు నగరాలకు చెందిన అధికారులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన మరో ఘనవిజయంగా దీన్ని అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+