ఏపీ రాజధాని: 'గుంటూరు-విజయవాడ ఏపీకి సెంటర్'
హైదరాబాద్: అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందనే ఉద్దేశంతోనే కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీని కోరామని మంత్రి పి నారాయణ చెప్పారు. శ్రీకాకుళం - గుంటూరు మధ్య దూరం 650 కిలోమీటర్లు, అనంతపూర్-గుంటూరు మధ్య 550 కిలోమీటర్లు ఉందన్నారు.
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఏ రకంగా చూసినా ఆ ప్రాంతం సెంటర్ అవుతుందని భావించామన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కమిటీ శనివారం సమావేశమవుతుందని చెప్పారు.

శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుస్తుందన్నారు. రాజధానికి అనువైన ప్రదేశం ఎంపికకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీకి కొన్ని మార్గదర్శకాలను సూచించిందని తెలిపారు.
రాజధాని నిర్మాణానికి నీరు, రైలు, రోడ్డు, ఎయిర్‌పోర్టు, భూమి అనువుగా ఉండే ప్రాంతంగా ఉండాలని, రాజ్ భవన్, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మించేందుకు అనువైన భూమిని ఎంపిక చేసుకోవాలని తెలిపారన్నారు. సామాజిక జీవనానికి అనువుగా ఉండే ప్రాంతంగా ఉండాలని కమిటీకి కేంద్రం సూచించిందని తెలిపారు. అదే కోణంలో పరిశీలించిన తమ కమిటీ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసిందన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications