మంత్రి నుండి తనకు, కుటుంబసభ్యులకు ప్రాణహని ఉంది, ఆమె కూతురులాంటిది

ఆంద్రప్రదేశ్ సాంఘీకసంక్షేమశాఖ మంత్రిపై గుంటూరు జిల్లా పరిషత్ చైర్మెన్ రావెల కిషోర్ బాబు పై ఆరోపణలు గుప్పించారు. తనను , తన భర్తను చంపుతామని రావెల అనుచరులు బెదిరించారని ఆమె చెప్పారు. ఈ ఆరోపణలను ఆయన ఖం

గుంటూరు :ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబుపై గుంటూరు జడ్ పి చైర్మెన్ జానీమున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రావెల కిషోర్ బాబు నుండి తనకు ప్రాణహని ఉందని ఆమె ఆరోపించారు.

తనతో పాటు, తన భర్తను కూడ ప్రాణహని ఉందని ఆమె ఆరోపించారు. రంజాన్ సమయంలో తమ ఇంటిపై రావెల అనుచరులు దాడి చేశారని ఆమె ఆరోపించారు.

తమను చంపుతామని బెదిరించారని ఆమె ఆరోపించారు. పార్టీ పరువు పోతోందనే ఉద్దేశ్యంతోనే తాను ఇప్పటివరకు బయటకు చెప్పలేదని చెప్పారు.

ravela

జడ్ పి చైర్మెన్ కూడ టిడిపి పార్టీకి చెందినవారే. అయితే మంత్రి రావెల కిషోర్ బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అయితే రావెల తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జానీమూన్ ఆరోపణలు గుప్పించడం మంత్రికి ఇబ్బంది కట్గిస్తోంది.

అయితే ఈ ఆరోపణలను మంత్రి రావెల కిషోర్ బాబు తీవ్రంగా ఖండించారు. జానీమూన్ తనకు కూతురు లాంటిదని , ఆమెకు ఎలాంటి హని తలపెట్టనని చెప్పారు.

సమస్య ఏదైనా ఉంటే తనతో నేరుగా చెప్పాలని ఆయన కోరారు. తనపై మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు.ఒకవేళ తాను తప్పుచేస్తే తనపై అధిష్టానం చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+