పథకం ప్రకారమే పిల్లలను చంపిన ప్రొఫెసర్ (పిక్చర్స్)

హైదరాబాద్: పక్కా పథకం ప్రకారమే ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పిల్లలను తీసుకుని వెళ్లి కాసేపు గడిపి తిరిగి భార్యకు అప్పగించాల్సిన గురుప్రసాద్ ఆ రోజు మాత్రం ఉట్టి చేతులతోనే వచ్చాడు. మేడ్చల్ ప్రాంతంలోని తన స్థలంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం హత్య చేసి పాతిపెట్టినట్లు అనుమానిస్తున్నారు.

మేడ్చల్ స్థలంలో అతను గోయి తవ్వించినట్లు చెబుతున్నారు. ఎందుకని అడిగితే భూమి పూజ కోసమని అతను చెప్పినట్లు తెలుస్తోంది. పిల్లలను మేడ్చల్‌లోని కల్పతరు రెసిడెన్సీ వెనక ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టాడు. ఈ విషయాన్ని వెంటనే భార్యకు చెప్పడానికి మెసేజ్ కూడా పంపినట్లు చెబుతున్నారు.

పిల్లలు వీరే..

పిల్లలు వీరే..

తండ్రి గురుప్రసాద్ చేతిలో హతమైన చిన్నారులు విఠల్ విరించి, నంద విహారీ వీరే. తండ్రి వెంట వెళ్లిన ఈ పిల్లలు శవాలై తేలారు.

గోతిని తవ్వి తీసి పెట్టాడు

గోతిని తవ్వి తీసి పెట్టాడు

పిల్లలు ఇద్దరినీ చంపి మేడ్చేల్ ప్రాంతంలోని తన సొంత స్థలంలో గోయి తీసి అందులో పాతిపెట్టాడు. శవాలను పోలీసులు వెలికి తీశారు.

గోయి ఇదే...

గోయి ఇదే...

పిల్లలను చంపి పాతిపెట్టడానికి గురుప్రసాద్ తీయించిన మేడ్చల్‌లోని గోయి ఇదే.. పిల్లలను హత్య చేసి గురుప్రసాద్ పాతిపెట్టాడు.

గురుప్రసాద్ మృతదేహం

గురుప్రసాద్ మృతదేహం

పిల్లలను చంపిన తర్వాత గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. జేమ్స్ స్ట్రీట్ రైలు పట్టాలపై అతని మృతదేహం కనిపించింది.

పోలీసుల దర్యాప్తు

పోలీసుల దర్యాప్తు

పిల్లల ఆచూకీ కోసం రెండు రోజుల పాటు అన్వేషించిన పోలీసులు మేడ్చేల్‌లోని గోతిలో పిల్లల శవాలను కనిపెట్టారు.

భార్య సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో మెసేజ్ డ్రాఫ్ట్ బాక్సులోనే ఉండిపోయింది. జేమ్స్ స్ట్రీట్ వద్ద గురుప్రసాద్ శవాన్ని కనిపెట్టిన రైల్వే పోలీసులు అతని సెల్‌ఫోన్ మెసేజ్‌లను పట్టించుకోలేదని అంటున్నారు. దానివల్లనే పిల్లల హత్య గురించి చాలా ఆలస్యంగా తెలిసిందని చెబుతున్నారు. పిల్లల మెడలపై కత్తి గాట్లు ఉన్నాయి. గొంతు నులిమి తన ఇద్దర పిల్లలు విఠల్ విరించి, నంద విహారీలను చంపి ఆ తర్వాత కత్తి గాట్లు పెట్టాడా, కత్తితోనే హతమార్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే పోలీసుల తీరుపై పిల్లల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల శవాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గురుప్రసాద్ ఆత్మహత్య, అతని పిల్లల హత్య తీవ్ర సంచలనం సృష్టించాయి. శవాలను తీసిన గోతి నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

గురుప్రసాద్ తన భార్య పనిచేస్తున్న ఇన్ఫోసిస్ చైర్మన్‌కు 12 పేజీల లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఓ లేఖ కూడా రాశాడు. భార్య సుహాసిని కూడా లేఖ రాశాడు. విడాకులు వద్దంటూ పలుమార్లు భార్యతో అతను మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇద్దరం సంపాదిస్తున్నామని, విడిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని అతను భార్యతో మొర పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+