అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చనిపోయిందనుకొంటే గుండెకొట్టుకొంది: కానీ, అంతలోనే అనంతపురంలో హైడ్రామా

అనంతపురం ఆసుపత్రిలో హైడ్రామా చోటుచేసుకొంది. చావుబతుకుల మధ్య ఉన్న ఓ యువతిని ఆసుపత్రికి తీసుకువస్తే చనిపోయిందని వైద్యులు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం ఆసుపత్రిలో హైడ్రామా చోటుచేసుకొంది. చావుబతుకుల మధ్య ఉన్న ఓ యువతిని ఆసుపత్రికి తీసుకువస్తే చనిపోయిందని వైద్యులు చెప్పారు.అయితే కొద్దిసేపటికే ఆమె గుండెకొట్టుకొంటుందని వైద్యులవద్దకు కుటుంబసభ్యులు పరిగెత్తారు.అయితే ఆమె చనిపోయిందని వైద్యులు తేల్చారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని యువతి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

అనంతపురం పట్టణంలోని వినాయకనగర్ కు చెందిన వాణి, శ్రీనివాసులు దంపతుల కుమార్తె బుదవారం ఉదయం ఆరున్నరగంటలకు ఇంట్లో ఉరేసుకొంది. అయితే ఆమె ఉరేసుకొన్న విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే అఖిల అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. అయితే వైద్యులు మృతిచెందిందని అఖిల మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన బంధువులు అఖిల మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు. అయితే వారికి అఖిల గుండెకొట్టుకొంటుందంటూ అనిపించింది.

Haidrama in Anantapur governament hospital

వెంటనే వారు అఖిల దేహాన్ని డాక్టర్ల వద్దకు తీసుకెళ్ళారు. అత్యవసర విభాగానికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెం్, ఆర్ ఎం ఓ , పలువురు వైద్యులు అక్కడికి చేరుకొని యువతిని పరీక్షించారు. అయితే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు.

అఖిల చికిత్స విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. బతికున్న అమ్మాయిని చనిపోయిందంటూ మార్చురీకి తరలించారని ఆరోపించారు. మొదట్లోనే సరిగా పరీక్షలు నిర్వహించారని చెప్పారు. వారు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. బంధువుల ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

ఇదిలా ఉంటే యువతి ఇంటి వద్దే మరణించినట్టు తెలుస్తోంది. అయినా తమ వైద్యులు అన్నిరకాల పరీక్షలు చేశారని చెప్పారు. మృతదేహంపై బంధువులు బలంగా తాకడంతో ఆ చలనమే అఖిల గుండె స్పందన అని భ్రమపడ్డారని చెప్పారు. అంతేకాదనీ, వైద్యుల నిర్లక్ష్యానికి ఏ మాత్రం తావు లేదన్నారు ఆసుపత్రి సూపరింటెండ్ జగన్నాథ్.

English summary
Hidrama in Anatapur government hospital.Akhila, 17 year old girl suicide in Ananatapur town on Wednesday. Akhila parents complaint against Anatapur government hospital doctors. police registered case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X