మే చివరినాటికి జగన్ పార్టీ సగం ఖాళీ: టిడిపిలోకి మరో 13 మంది ఎమ్మెల్యేలు?

హైదరాబాద్‌: మే చివరినాటికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సగం ఖాళీ అవుతోందని అంటున్నారు. దాదాపు మరో 13 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 17 మంది వైసిపి శానససభ్యులో టిడిపిలోకి ఫిరాయించారు. మే చివరినాటికి ఆ సంఖ్య 30కి చేరుకుంటుందని అంటున్నారు.

ప్రస్తుతానికి మాత్రం ఐదుగురు వైసిపి శాసనసభ్యులు టిడిపిలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసిపి నేత విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడుగు పెట్టకుండా చూడాలనే లక్ష్యంతో టిడిపి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. పూర్తిగా నాలుగు రాజ్యసభ సీట్లను గెలుచుకునే దిశగా వైసిపి ఎమ్మెల్యేలను టిడిపి నాయకులు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజ్యసభకు వెళ్లకుండా విజయసాయిరెడ్డిని అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీలోకి కనీసం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే తెలుగుదేశం నేతలు వ్యూహాలు రచించి, అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు, గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది తెలుగుదేశం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Half the YCP MLAs may jump into Telugu Desam

నియోజకవర్గ అభివృద్ధికి తగిన హామీతోపాటు ఆయా నియోజకవర్గాలలో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి హామీలు ఇస్తున్నారు. దీంతో వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి క్యూ కడుతున్నారు. తెలుగుదేశం పక్షాన ఆయా నియోజకవర్గాలలో ఉన్న పార్టీ ఇన్‌ఛార్జ్‌లను కూడా చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరగబోతున్నదనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వారికి భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో యాభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయనీ, అందరికీ అవకాశాలు వస్తాయనీ చంద్రబాబు చెబుతూ వస్తున్నారు.

ఒకవైపు పార్టీలో అంతర్గతంగా సర్దుబాట్లు చేసుకుంటూనే, మరోవైపు తెలుగుదేశం నేతలు వలసలకు చంద్రబాబు తలుపులు తెరిచారు. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని 15వ తేదీకి విజయవాడ చేరుకుంటారు. ఈనెల 16 నుంచి 31 వరకు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+