వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు చంద్రబాబు-లోకేష్ శుభాకాంక్షలు, 'మీరిచ్చిన ధైర్యంతోనే ఈ పని'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్‌కు చంద్రబాబు-లోకేష్ శుభాకాంక్షలు

అమరావతి: సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇది ఆయన 46వ పుట్టిన రోజు. 1971 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించిన ఆయన 25 ఏళ్లకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. నెంబర్ వన్‌గా ఎదిగారు. టాలీవుడ్‌లో అత్యధిక ప్రజాధరణ కలిగిన హీరోగా ఉన్న సమయంలోనే సినిమాలను దాదాపు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు.

2014లో ఆయన జనసేనను స్థాపించారు. నాటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే ఉండాల్సిన అవసరం లేదని, అధికారంలో ఉన్న వారిని నిలదీసి, ప్రజలకు మంచి చేయాలనేది ఆయన సిద్ధాంతం.

జనసేనానికి చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ నిత్యం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు నారా లోకేష్ శుభాకాంక్షలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, నిత్యం ఆనందంగా జీవించాలని, మంచి జీవితం ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు అబ్బాయి శుభాకాంక్షలు

తన సతీమణి ఉపాసన కామినేని ట్విట్టర్ అకౌంట్ ద్వారా రామ్ చరణ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. నిజ జీవితంలో, సినిమాల్లో డేరింగ్ అంశాలు చేసేందుకు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రామ్ చరణ్ పారాచూట్‌తో విన్యాసాలు చేస్తూ పవన్‌కు విష్ చేశారు.

వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, ఇతర హీరోల అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనకు సంబంధించిన పలు ప్రసంగాలు, పలు సినిమాల క్లిప్పింగులను అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.

English summary
Kalyan was born to Konidela Venkat Rao and Anjana Devi in Bapatla, Andhra Pradesh. He is the younger brother of Chiranjeevi and Nagendra Babu. He started using the name "Pawan" after a martial arts presentation he organized to demonstrate his training.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X