జగన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు మరో చిక్కు: వేధింపుల కేసు పెట్టిన భార్య
విజయవాడ: ఆయనో మాజీ ఎమ్మెల్యే. యువకుడిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చేసిన సదరు నేత.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఇలావుండగా, ఆయన ఇటీవలే ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. తనను నమ్మి వచ్చిన ఆ యువతికి బాగా చూసుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దీంతో ఎన్నో ఆశలతో ఆ నేత ఇంట కాలు మోపిన ఆ యువతి షాక్ తింది. అతని వేధింపులు భరించలేక ఆ మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళితే.. ఇప్పటికే కాల్‌మనీ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. కాల్ మనీ కేసు నేపథ్యంలో ఇప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన సతీమణి సోమవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మురళీకృష్ణపై వేధింపుల కేసు నమోదు చేశారు.
అధికారులపై జగన్ పార్టీ ఎమ్మెల్యే వీరంగం

ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెద్ద కలకలమే రేపారు. జగన్ వ్యాఖ్యలపై మూకుమ్మడిగా దాడి చేసిన టీడీపీ మంత్రులు, పార్టీ వర్గాలు ఆయనను దుమ్మెత్తిపోశాయి.
కాగా, ఈ వ్యవహారం కాస్తంత సద్దుమణిగిన నేపథ్యంలో సోమవారం జగన్ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే ఇదే తరహా అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన విరుచుకుపడింది టిడిపి నేతలపై కాదు.. ప్రభుత్వ ఉద్యోగులపై. ఎమ్మెల్యే బూతు పురాణంంతో షాక్‌కు గురైన అధికారులు ఆయనపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకెళితే.. కడప జిల్లా మైదుకూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి సోమవారం ప్రభుత్వం నిర్వహించిన ఏరువాకలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో మైదుకూరులో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చిన రఘురామిరెడ్డి... అధికారులపై దురుసుగా ప్రవర్తించారు.
'వ్యవసాయ శాఖలో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అంతా మోసపూరితమే. ఏ ఒక్క అధికారి కూడా నీతి నిజాయతీ ఎరుగరు. మీ కథ తేలుస్తా. చెప్పులతో కొట్టిస్తా. ఊళ్లోకి రానివ్వకుండా చేస్తా' అని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత ఆయనను సాగనంపేందుకు కారు దాకా వెళ్లిన ఓ అధికారిపై ఆయన ఏకంగా బూతు పురాణం వినిపించారట. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ఆ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications