హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాతబస్తీలో స్నేహితులతో కలిసి హరికృష్ణ చక్కర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna in Old city
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు నందమూరి హరికృష్ణ శుక్రవారం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలోని ఓ ప్రాంతంలో కలియ తిరిగారు. తన స్నేహితులతో కలిసి పాతబస్తీలోని ముర్గిచౌక్, చిడియా బజార్‌లను సందర్శించారు. పెంపుడు పక్షులను తిలకించారు.

అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్: నాయిని

తెరాస ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఇందుకోసం అందరం కలిసి పని చేద్దామని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహా రెడ్డి వేరుగా అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్ నగరాన్ని 100 కిలోమీటర్ల నిడివిలో విస్తరించి టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడం, కరెంట్, మంచినీటి సమస్యలు లేకుండా చూడటం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. నగరానికి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు రానుందని తద్వారా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

ఆ రంగంలో 50 వేల ఉద్యోగాలు, కాగా ప్రైవేట్ రంగంతో ఎలాంటి సంబంధం లేకుండా కరెంట్‌ను జెన్‌కో ద్వారానే ఉత్పత్తి చేయడం ద్వారానే మరో 50 వేల ఉద్యోగాలతో కలిపి రానున్న రెండేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.

English summary
Telugudesam Party senior leader Harikrishna in Old city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X