బాలయ్యను బుట్టలో వేసుకోవడానికే: హరి (పిక్చర్స్)
హైదరాబాద్: తన బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరోసారి ధ్వజమెత్తారు. తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు శనివారం ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణను బుట్టలో వేసుకోవడానికే రాజ్యసభ సీటును చంద్రబాబు ఎరగా వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు ఒడిగట్టారని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్లీ ఎన్టీ రామారావు రావాలని ఆయన అన్నారు. తమ పార్టీలో కూడా మూర్ఖులు ఉన్నారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు జీవించి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేదా అని ఆయన అడిగారు. వెనకబడిపోతున్నామనే ఆందోళనతో ఒకరిని మించి మరొకరు రాష్ట్ర విభజనకు సహకరించారని ఆయన అన్నారు. తెలుగుజాతిని విడగొట్టి ఆనందించే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.
రాష్ట్ర సమైక్యత కోసం తాను రాజీనామా చేశానని, తన రాజీనామాపై విపరీత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఆవేశంలో రాజీనామా చేశాడని తనను అన్నారని, అలా అన్న మూర్ఖుడికి ఏం తెలుసునని ఆయన అన్నారు. ఎన్టీఆర్ రక్తాన్ని పంచుకుని పుట్టానని, తనపై కుక్కల్లా మొరిగాయని ఆయన అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ ఆవేశంలోంచి, తెలుగు ప్రజల ఆవేదనలోంచి తెలుగుదేశం పార్టీ వచ్చిందని, తన తండ్రి ఆవేదన, ప్రజల ఆవేదన తనలో ఉందని ఆయన అన్నారు. వాటిని చూసుకుని తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఆవేశం, ప్రజల ఆలోచన లేకుంటే తెలుగుదేశం పార్టీ లేదని ఆయన అన్నారు. ఇప్పుడున్నవారెవరూ రాష్ట్రాన్ని కాపాడలేరని ఆయన అన్నారు.

సోదరుడితో కలిసి హరకృష్ణ
మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తన సోదరుడు జయకృష్ణతో కలిసి తండ్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి వచ్చారు.

కుటుంబ సభ్యులతో కలిసి హరికృష్ణ
ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు.

పార్టీ నాయకులపై విమర్శ
తమ పార్టీలోనూ మూర్ఖులున్నారని నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు తీసుకున్న వైఖరిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

తండ్రికి నివాళులు
తండ్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆవేశంలోంచి, తెలుగు ప్రజల ఆవేదనలోంచి పుట్టిందని హరికృష్ణ అన్నారు.

ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలి..
తెలుగుజాతిని రక్షించడానికి, రాష్ట్రాన్ని కాపాడడానికి ఎన్టీ రామారావు మళ్లీ పుట్టాలని, ఇప్పుడున్న నాయకులెవరూ రాష్ట్రాన్ని కాపాడలేరని హరికృష్ణ అన్నారు.

నాపై దుష్ప్రచారమని హరికృష్ణ
తాను వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

హరి వెంట కళ్యాణ్ రామ్
ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించే విషయంలో హరికృష్ణ వెంట కుటుంబ సభ్యులతో పాటు కుమారుడు కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.

బాలయ్యకు రాజ్యసభ సీటుపై..
బాలయ్యను బుట్టలో వేసుకోవడానికే రాజ్యసభ సీటు ఎర వేస్తున్నారని హరికృష్ణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు.

ఆవేశంతోనే చేశానని అన్నారు..
ఆవేశంతో తాను రాజీనామా చేశానని అన్నారని, ఎన్టీ రామారావు ఆవేశంలోంచే తెలుగుదేశం పార్టీ పుట్టిందని హరికృష్ణ అన్నారు.

మా పార్టీలోనూ మూర్ఖులు..
తమ పార్టీలోనూ మూర్ఖులున్నారని హరికృష్ణ అన్నారు. రాష్ట్ర విభజనకు నాయకులు పోటీ పడి మద్దతు ఇచ్చారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications