ఎన్టీఆర్ కల: బాబును మెచ్చుకున్న హరికృష్ణ, 'జగన్‌కు ముని శాపం'
విజయవాడ: గోదావరి, కృష్ణమ్మలను కలిపిన చారిత్రక ఘటన పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణలు బుధవారం నాడు స్పందించారు. పట్టిసీమ పంపు నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పైలాన్ ఆవిష్కరించారు. కృష్ణా జిల్లాలోని ఫెర్రీలో కృష్ణా, గోదావరి జలాలు కలుస్తున్నాయి. పట్టిసీమ నుంచి నీటి విడుదల పైన హరికృష్ణ స్పందించారు. చంద్రబాబుకు కితాబిచ్చారు.
వాజపేయి కల నెరవేరింది: వెంకయ్య
గోదావరి, కృష్ణా నదుల కలయిక పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. నదుల అనుసంధానానికి పట్టిసీమ తొలి అడుగు అని వెంకయ్య అన్నారు.

పట్టిసీమ నుంచి నీళ్లు వదలటం శుభ పరిణామం అని చెప్పారు. నదుల సంధానం అనే వాజపేయి కల నెరవేరుతోందన్నారు. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి పట్టిసీమ స్ఫూర్తి అని వెంకయ్య నాయుడు చెప్పారు.
జగన్‌కు మునుల శాపం
ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా వైసిపి అధ్యక్షులు జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఎద్దేవా చేశారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రతి పనినీ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
జగన్‌కు మునుల శాపం ఉందని విమర్శించారు. అందువల్లే ఆయన అలా ప్రవర్తిస్తున్నారన్నారు. జగన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. లక్షల కోట్లను అక్రమంగా సంపాదించిన జగన్‌కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రైతులపై, పేదలపై జగన్‌కు ప్రేమాభిమానాలు లేవని, కేవలం పదవీ వ్యామోహంతోనే వివిధ కార్యక్రమాలు చేపడతారన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications