అవకాశవాదం, దోపిడీ: జగన్‌కు హరీష్, నాగం హెచ్చరిక

 Harish and Nagam fires at YS Jagan
వరంగల్/హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సమైక్య సభ నిర్వహిస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటులో వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు, భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిలు వేర్వేరుగా మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసమే జగన్ హైదరాబాదులో సభ అంటున్నారని ధ్వజమెత్తారు.

జగన్ తన బాధను జనం బాధగా చెప్పేందుకే సమైక్య శంఖారావమంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో సభ పెడితే తీవ్ర పరిణామాలుంటాయని, మానుకోట పునరావృతం అవుతుందని హెచ్చరించారు. హైదరాబాదులో జగన్ పార్టీ జెండా ఉండదన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఇరు ప్రాంతాల ప్రజలకు జగన్ గాలం వేస్తున్నారని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడ్డారని ధ్వజమెత్తారు.

పదవి కోసం ఆరాటం, అవకాశవాదం, దోపిడీ జగన్ నైజమన్నారు. గనులు పంచివ్వడమే సమన్యాయమా చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే లోటస్ పాండు దెయ్యాల కొంపలా అవుతుందనే జగన్ బాధ అని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయం చేయాలనుకుంటే సీమాంధ్రకు వెళ్లి పోవాలని, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని మండిపడ్డారు.

రెచ్చగొట్టేందుకే: నాగం

తెలంగాణ ప్రాంతంలో వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే జగన్ హైదరాబాదులో సభ పెడుతున్నారని నాగం ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే సభ అన్నారు. జగన్ సభకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తోందన్నారు. రేపటి కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నోట్ ఆమోదించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాట తీరు అలజడులు సృష్టించేలా ఉందని, ఆయన కాసు బ్రహ్మానంద రెడ్డిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్ నోట్‌కు, ఆంటోని కమిటికి సంబంధం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+