చెరువుల పరిరక్షణ: పూర్వ వైభవం తెస్తామన్న హరీశ్

హైదరాబాద్: తెలంగాణలోని చెరువులను పరిరక్షిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన సోమవారం జలసౌధలో చిన్న నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వాహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించి చిన్న నీటి పారుదలకు పూర్వ వైభవం తెస్తామని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో చిన్న నీటి పారుదల రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులను పునరుద్దరిస్తామని ఆయన అన్నారు.

 Harish Rao reviews on pond in Telangana

చిన్న నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి పర్చాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతతో కూడిన పనులు జరగాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.

సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేసి థర్డ్ ఫేజ్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకొకసారి మైనర్ ఇరిగేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+