వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్షకుమార్ తనయులు రిలీజ్, సమైక్యవాదుల ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
రాజమండ్రి: అమలాపురం పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ తనయులు విడుదలయ్యారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న ఎపిఎన్జీవోలపై దాడి చేసిన కేసులో అరెస్టయిన వారిని పోలీసులు ఆదివారం విడుదల చేశారు. ముందుగా నమోదు చేసిన సెక్షన్లలో కొద్దిగా మార్పులు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. సమైక్య ఉద్యమంలో భాగంగా ఎన్జీవోలు శనివారం రాజమండ్రిలో ఎంపి హర్ష కుమార్‌కు చెందిన రాజీవ్ గాంధీ విద్యా సంస్థల వద్ద ఫ్లెక్సీని చింపివేయడంతో హర్ష కుమార్ కుమారులు శ్రీరాజ్, సుందర్ కర్రలతో ఆందోళనకారులను చితకబాదారు.

ఈ ఘర్షణపై ఇరువర్గాలు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఎంపీ తనయులు శ్రీరాజ్, సుందర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే కళాశాలపై దాడికి సంబంధించి సమైక్యవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాలపై దాడి చేశారనే కారణంతో కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన ఐదుగురికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చామని పోలీసులు తెలిపారు.

కాగా ముందుగా నమోదు చేసిన సెక్షన్లను మార్పులు చేసి ఎంపీ తనయులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపి తనయులు విడుదలయ్యారనే విషయం తెలియడంతో మాదిగ దండోరా నాయకులు, సమైక్యవాదులు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. కేసును తారుమారు చేశారని తప్పుపట్టారు.

ఎపిఎన్జీవోల నేతలపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎంపి హర్షకుమార్ కేవలం క్షమాపణలు చెబితే చాలదని, ఆయన కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఎపిఎన్జీవోల ఐకాస డిమాండ్ చేసింది. ఇదే క్రమంలో ఆ సంఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి డిమాండ్ చేయనున్నామని స్పష్టం చేసింది. విజయనగరంలో ఎంపి ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఉద్యోగులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary

 Amalapuram MP Harsha Kumar sons Sriraj and Sunder released on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X