మహిళ అయి, రేణుకా చౌదరి నన్ను బాధపెట్టారు: హర్ సిమ్రాత్ కౌర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేష్, రేణుకా చౌదరిల పైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వారు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని శిరోమణి అకాలీదళ్ సభలో సోమవారం తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు.

తమ పార్టీ సభ్యురాలు, కేంద్రమంత్రి హరిసిమ్రత కౌర్‌ బాదల్‌ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కింద పరిగణించి వారిపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ కోరింది. ఆప్‌ ఎంపీ భగవంత మాన్‌ వీడియోపై రేగిన వివాదంతో శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ అంశంపై సభలో మాట్లాడేందుకు కేంద్రమంత్రి అయిన హర్ సిమ్రాత్ ప్రయత్నించారు. ఈ సమయంలో జైరాం రమేశ్, రేణుకా చౌదరి అడ్డుకున్నారని, సభ బయట కూడా అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆ పార్టీ సభ్యుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా ఆరోపించారు.

కేంద్రమంత్రిగా ఆమెకు ఏ సభలోనైనా మాట్లాడే హక్కు ఉందని చెప్పారు. దీనిని అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. జైరాం రమేష్, రేణుక చౌదరి మంత్రికి క్షమాపణ చెప్పాలని లేదా సభా హక్కుల తీర్మానాన్ని ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.

హర్ సిమ్రాత్ కౌర్ బాదల్

హర్ సిమ్రాత్ కౌర్ బాదల్

అంతకుముందు రోజు హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ.. జైరాం రమేష్, రేణుకలు తనను సభలో అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు.

హర్ సిమ్రాత్ కౌర్ బాదల్

హర్ సిమ్రాత్ కౌర్ బాదల్

ఏపీ ఎంపీ భగవంత్ మాన్.. పార్లమెంటుకు సంబంధించి వివిధ ప్రదేశాలను వీడియోలో చిత్రీకరించడంపై ఈ నెల 23న రాజ్యసభలో జరిగిన సంఘటనల క్రమాన్ని హర్ సిమ్రాత్ కౌర్ ఆ లేఖలో వివరించారు. వారిద్దరు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు.

రేణుకా చౌదరి

రేణుకా చౌదరి

మహిళగా, మంత్రిగా తన గౌరవానికి భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల అభ్యంతరకర మాటలు మాట్లాడారని చెప్పారు. రేణుకా చౌదరి తన వైపు దూసుకొచ్చారని ఫిర్యాదు చేశారు. వారిద్దరి ప్రవర్తన తనను బాధించిందన్నారు. తన పట్ల అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్నారు. రేణుక మహిళ అయి ఉండి తన పట్ల అవమానకరంగా మాట్లాడారన్నారు.

జైరామ్ రమేష్

జైరామ్ రమేష్

కాగా, హర్ సిమ్రాత్ ఫిర్యాదు పైన జైరామ్ రమేష్ స్పందించారు. తాను అమర్యాదగా ప్రవర్తించానని ఆమె ఫిర్యాదు చేయడం సరికాదని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister Harsimrat Kaur Badal has written to Rajya Sabha Chairman seeking “stern action” against Congress MPs Jairam Ramesh and Renuka Chaudhary, accusing the duo of humiliating her in the House.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి